తాళ్లచెరువులో ముత్యాలమ్మ, మారెమ్మ, అంకాలమ్మ, దేవతల విగ్రహాల ప్రతిష్ఠతో ఆధ్యాత్మిక శోభ
అమ్మవార్లను దర్శించుకున్న పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి
ప్రజాపక్షం/తిరుమలాయపాలెం:తాళ్లచెరువు: గ్రామంలో ముత్యాలమ్మ, మారెమ్మ, అంకాలమ్మ దేవతల విగ్రహాల ప్రతిష్ఠా మహోత్సవం రోజులపాటు ఘనంగా నిర్వహించారు. ప్రజల కోరిక మేరకు పాలకమండలి నూతన దేవాలయాలను నిర్మించి విగ్రహాల ప్రతిష్టను ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి హాజరై దేవత విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో ముత్యాలమ్మ మారెమ్మ అహంకాలమ్మ దేవతల విగ్రహాలను ప్రతిష్టించుకోవడం సంతోషదాయకమని ప్రజలంతా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖశాంతులతో సుభిక్షంగా ఉండాలని. దేవతలను వేడుకున్నట్లు ఆయన తెలిపారు. మూడు రోజులపాటు గ్రామంలో అత్యంత భక్తి శ్రద్ధలతో కుల మతాలకు అతీతంగా ప్రజలంతా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మొదటిరోజు విగ్రహాలకు జల బిందెలతో మహిళలంతా ఆలయం వద్దకు చేరుకొని అభిషేకాలు నిర్వహించారు.రెండో రోజు కుంకుమ పూజ మూడో రోజు హోమగుండం అనంతరం విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని వేద పండితులు వేదమంత్రాలు మంగళ వాయిద్యాలు మధ్య విగ్రహాలను ప్రతిష్టించారు. నూతన విగ్రహాల ప్రతిష్టతో తాళ్లచెరువు గ్రామంలో బంధుమిత్రుల చుట్టుపక్కర గ్రామాల ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. విగ్రహ ప్రతిష్ట కు వచ్చిన భక్తులకు ప్రతి ఒక్కరికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వాహకులు ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు భాషబోయిన వీరన్న, తాళ్ళచెరువు మాజీ సర్పంచ్ జోగుపర్తి వెంకటేశ్వర్ల, మాజీ ఎంపీటీసీ వాలూరి దామోదర్,గడిపూడి రాజా,సర్పంచ్ గడిపూడి వెంకటనారాయణ, ఉపసర్పంచ్ మానుకొండ రాజా, బోడ మంచా నాయక్, షేక్ చందు, ధారావత్ శంకర్ నాయక్,బిల్లగిరి ధనుంజయ, గుంటి పుల్లయ్య, చామకూరి రాజు, పరికపల్లి చంద్రశేఖర్, బొల్లి కొండ రమేష్, దొనపల్లి వీరబాబు తదితరులు పాల్గొన్నారు.


إرسال تعليق