గంగమ్మ ఆలయానికి రూ.50 వేల విరాళం
ప్రజాపక్షం / ఖమ్మం రూరల్:ఏదులాపురం మున్సిపాలిటీ 32వ వార్డు పరిధిలో నిర్మాణంలో ఉన్న శ్రీ గంగమ్మ ఆలయానికి కాంగ్రెస్ నాయకుడు వెంపటి సురేష్–రమాదేవి దంపతులు రూ.50 వేల ఆర్థిక సహాయం బుధవారం అందించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు వారికి కృతజ్ఞతలు తెలియజేశారు.ప్రజా ప్రతినిధిగా ప్రజల సమస్యల పరిష్కారంలో ముందుండి నిస్వార్థ సేవలందించిన దివంగత వెంపటి రామకోటయ్య ఆశయాలను కొనసాగిస్తూ, ఆయన కుమారుడు వెంపటి సురేష్ ప్రజా సేవతో పాటు సామాజిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు తన వంతు సహకారం అందిస్తున్నారని స్థానికులు కొనియాడారు. గంగమ్మ ఆలయ నిర్మాణానికి అందించిన విరాళం ఆయన సేవాభావానికి నిదర్శనమని అభిప్రాయపడ్డారు.తండ్రి సంపాదించిన మంచి పేరును నిలబెట్టుకుంటూ సమాజానికి ఉపయోగపడే ప్రతి మంచి కార్యక్రమానికి అండగా నిలుస్తున్న వెంపటి సురేష్ సేవలను పలువురు ప్రశంసించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు యర్రా శేఖర్ రెడ్డి, ఏపూరి తరుణ్, వడ్లకుండ భుజంగరావు, మేళ్లచెర్వు సురేష్, ఆలయ కమిటీ సభ్యులు బి. మల్లయ్య, బి. నాగయ్య, జి. సిద్ధు, రాములు, శ్రీశైలం, రాము, పుల్లయ్య, లింగరాజు, ఉదయ్, గోపి, వెంకటేష్, అనిల్, ప్రశాంత్, రేనయ్య, ప్రవీణ్, రామకృష్ణ, మోక్ష తేజ్, చందు, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.

إرسال تعليق