ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

తనిఖీల్లో చిక్కిన అడవి పందుల అక్రమ రవాణా


డీసీఎం వ్యాన్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. నిందితుడిపై కేసు నమోదు

ప్రజాపక్షం–నేలకొండపల్లి:తెల్లవారుజామున పోలీసులు నిర్వహించిన సాధారణ వాహన తనిఖీలు వన్యప్రాణుల అక్రమ రవాణా గుట్టును రట్టుచేశాయి. మెదక్ జిల్లా నుంచి కోదాడకు డీసీఎం వ్యాన్‌లో అక్రమంగా తరలిస్తున్న ఏడు అడవి పందులను నేలకొండపల్లి పోలీసులు పట్టుకుని అటవీ శాఖ అధికారులకు అప్పగించారు. రవాణా సమయంలో రెండు అడవి పందులు మృతి చెందగా, మిగిలిన ఐదు పందులను అటవీ శాఖ అధికారులు ఖమ్మం జిల్లా వెలుమట్ల అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. నిందితుడిపై సంబంధిత చట్టాల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.మండలంలోని చెరువుమాదారం క్రాస్‌రోడ్డు వద్ద శనివారం తెల్లవారుజామున పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా వెళ్తున్న డీసీఎం వ్యాన్‌ను ఆపి పరిశీలించారు. తనిఖీల్లో వ్యాన్‌లో ఇరుకుగా బంధించి ఉంచిన ఏడు అడవి పందులు కనిపించడంతో వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. అనంతరం అధికారులు ఘటనాస్థలికి చేరుకుని పందులను స్వాధీనం చేసుకున్నారు.అధికారుల పరిశీలనలో రవాణా సమయంలో ఊపిరాడక రెండు అడవి పందులు మృతి చెందినట్లు గుర్తించారు. ప్రాణాలతో ఉన్న ఐదు పందులను ఖమ్మం జిల్లా వెలుమట్ల అటవీ ప్రాంతంలో సురక్షితంగా విడిచిపెట్టారు. మృతి చెందిన రెండు అడవి పందులు, డీసీఎం వ్యాన్‌ను ఖమ్మం ఫారెస్ట్ రేంజ్ కార్యాలయానికి తరలించారు. మృతి చెందిన పందులకు మెజిస్ట్రేట్ సమక్షంలో పోస్టుమార్టం నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.వన్యప్రాణుల సంరక్షణ చట్టం కింద నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. అడవి జంతువుల అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా కొనసాగుతుందని, ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

إرسال تعليق

Post a Comment (0)

أحدث أقدم