ప్రజాపక్షం / వైరా:మరణానంతరం కూడా జీవితాల్లో వెలుగు నింపే మహోన్నత సేవకు సంగిశెట్టి పద్మ కుటుంబ సభ్యులు ముందుకొచ్చారు. పద్మ జీవించి ఉన్నప్పుడే వ్యక్తం చేసిన ఆకాంక్ష మేరకు, ఆమె మరణానంతరం రెండు నేత్రాలను ఖమ్మం నేత్రనిధికి దానం చేశారు.వైరా లయన్స్ క్లబ్ అధ్యక్షుడు కొల్లా రాంబాబు ఆధ్వర్యంలో నేత్రదాన ప్రక్రియ విజయవంతంగా నిర్వహించి, నేత్రాలను ఖమ్మం నేత్రనిధికి అప్పగించారు. ఈ సందర్భంగా నేత్రదానం ద్వారా మరొకరికి చూపు ప్రసాదించే అవకాశం లభిస్తుందని నిర్వాహకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షుడు కొల్లా రాంబాబు, నూకల ప్రసాదరావు, సంగిశెట్టి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొని నేత్రదానం వంటి మహోన్నత సేవకు సమాజంలోని ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని వారు పిలుపునిచ్చారు.

إرسال تعليق