ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

వీవోఏల ఆధ్వర్యంలో రైతు ఆశీర్వాద సభకు భారీగా తరలిన మహిళలు, రైతులు



 ప్రజాపక్షం/తిరుమలాయపాలెం:ఖమ్మం జిల్లా చింతకాని జగన్నాధపురంలో ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మంగా చేపట్టిన రైతు ఆశీర్వాద సభకు తిరుమలాయపాలెం మండలం నుండి వివో ఏల ఆధ్వర్యంలో మహిళలు రైతులు భారీగా తరలి వెళ్లారు. పాలేరు శాసనసభ్యులు రాష్ట్ర రెవిన్యూ గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సూచనల మేరకు మొదటిసారిగా వివోఏ లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొనే రైతు ఆశీర్వాద సభకు వివోఏ లకు అప్పగించడం స్వచ్ఛందంగా మహిళలు రైతులు తరలి వెళ్లారు. రైతు ఆశీర్వాద సభకు వచ్చే మహిళలకు రైతులకు తగు భోజనం ఏర్పాట్లను ఏర్పాటు చేశారు. ఈ బాధ్యతను వివోఏలకు అప్పగించడం గత వారం రోజుల నుంచి గ్రామాలలో మహిళలను రైతులను బొట్టు పెట్టి ఆహ్వానించడం ప్రజలను చైతన్యపరచడం వివోఏలు సబలికృతమయ్యారు. స్వయం సహాయక సంఘాల సభ్యులను ఇందిరమ్మ చీరలను కట్టుకొని భారీగా మండలం నుండి మహిళలు కదలడం అధికారులు సంతోష వ్యక్తం చేశారు. పిండిప్రోలు గ్రామం నుండి మహిళలను రైతులను భారీ సంఖ్యలో తరలించేందుకు కృషి చేసిన పంచాయతీ కార్యదర్శి మాధవి, ఈజీఎస్ మనోహర్ వివో ఏలు మేకల కృష్ణవేణి, గోపోజు ఉపేంద్ర, పరికపల్లి స్రవంతి, టి ఏ సలేహ బేగం, పిండిప్రోలు కాంగ్రెస్ నాయకులు తదితరులు ఉన్నారు.

إرسال تعليق

Post a Comment (0)

أحدث أقدم