

ప్రజాపక్షం/ఖమ్మం రూరల్: ఎదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని ప్రియదర్శిని మహిళా ఇంజనీరింగ్ కళాశాల (స్వయం ప్రతిపత్తి) లో ఐబీఎం స్కిల్ , బిల్డ్, టాస్క్ ఆధ్వర్యంలో గ్రాడ్యుయేట్ లర్నింగ్ ఎక్స్పీరియన్స్ ప్రోగ్రాం పై మూడు రోజుల శిక్షణా కార్యక్రమం సోమవారం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమం జూలై 6 నుండి 8వ తేదీ వరకు నిర్వహించబడుతుందిఈ సందర్భంగా కళాశాల చైర్మన్ కాటేపల్లి నవీన్ బాబు మాట్లాడుతూ నేటి పోటీ ప్రపంచంలో కేవలం డిగ్రీ సాధించడం మాత్రమే సరిపోదు. పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలను పెంపొందించుకోవడం అత్యంత అవసరమని, అలాంటి విలువైన అవకాశాన్ని ఈ మూడు రోజుల శిక్షణా కార్యక్రమం విద్యార్థినులకు అందించడం జరుగుతుందని, ప్రతి విద్యార్థి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, కొత్త విషయాలను నేర్చుకొని, తన ప్రతిభను మరింత మెరుగుపరచుకోవాలని, విద్యార్థులను ప్రపంచ స్థాయి నైపుణ్యాలతో తీర్చిదిద్దడమే మా కళాశాల ముఖ్య లక్ష్యమని అందుకే ప్రముఖ సంస్థలతో భాగస్వామ్యం ఏర్పరుచుకొని ఇటువంటి శిక్షణా కార్యక్రమాలను నిరంతరం నిర్వహిస్తుంటామని, దీనికి సహకరించిన ఐబీఎం స్కిల్స్ బిల్డ్, టాస్క్, ఎడ్యునెట్ ఫౌండేషన్, బృందానికి అభినందనలు తెలిపారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బి గోపాల్ మాట్లాడుతూ, ప్రస్తుతం ప్రపంచం కృత్రిమ మేధస్సు , జనరేటివ్ ఎఐ, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ , రోబోటిక్స్, బ్లాక్‌చెయిన్, ఎడ్జ్ కంప్యూటింగ్ వంటి ఆధునిక సాంకేతికతలతో వేగంగా రూపాంతరం చెందుతోంది. ఈ మార్పులకు అనుగుణంగా విద్యార్థులు కేవలం పాఠ్యపుస్తకాల పరిజ్ఞానానికే పరిమితం కాకుండా, పరిశ్రమకు అవసరమైన ఆధునిక నైపుణ్యాలను కూడా అలవర్చుకోవడం అత్యంత అవసరమని, ఈ మూడు రోజుల కార్యక్రమం ద్వారా విద్యార్థులు హ్యాండ్స్-ఆన్ ట్రైనింగ్, ప్రాజెక్ట్ ఆధారిత అభ్యాసం, డిజైన్ థింకింగ్, సమస్యల పరిష్కార నైపుణ్యాలు, క్రిటికల్ థింకింగ్, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ వంటి అంశాలపై అవగాహన పెంపొందించుకుంటారని, ఇవి భవిష్యత్తులో ఉన్నత విద్య, పరిశోధన, స్టార్టప్‌లు మరియు ఉద్యోగ అవకాశాలలో వారికి ఎంతో దోహదపడతాయని తెలిపారు. ఈ సందర్భంగా టాస్క్ డిస్ట్రిక్ట్ మేనేజర్ పి దినేష్ మాట్లాడుతూ టాస్క్ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో విద్యార్థులు పరిశ్రమ అవసరాలకు అనుగుణమైన నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడానికి ఏర్పాటు చేయబడిన ఒక ప్రముఖ వేదిక. కళాశాల విద్యను పరిశ్రమ అవసరాలతో అనుసంధానించడం, విద్యార్థుల ఉపాధి అవకాశాలను మెరుగుపరచడం టాస్క్ ప్రధాన లక్ష్యమని, టాస్క్ ద్వారా విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), జనరేటివ్ AI, మెషిన్ లెర్నింగ్, డేటా అనలిటిక్స్, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (IoT), ఫుల్ స్టాక్ డెవలప్మెంట్, పైథాన్ ప్రోగ్రామింగ్, UI/UX, సాఫ్ట్ స్కిల్స్, ఆప్టిట్యూడ్, కమ్యూనికేషన్ స్కిల్స్, రెజ్యూమె బిల్డింగ్, ఇంటర్వ్యూ స్కిల్స్ వంటి అనేక రంగాలలో శిక్షణ అందించబడుతోందని, అంతేకాకుండా ప్రముఖ సంస్థలైన ఐబీఎం స్కిల్స్ బిల్డ్, సిస్కో, సేల్స్ ఫోర్స్, ఏ డబ్ల్యు ఎస్, గూగుల్, మైక్రోసాఫ్ట్, ఒరాకిల్ వంటి భాగస్వామ్య సంస్థల ద్వారా ప్రపంచ స్థాయి డిజిటల్ కోర్సులు, వర్క్‌షాప్‌లు, వెబినార్లు, సర్టిఫికేషన్ కార్యక్రమాలు విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఈ సందర్భంగా ఎడ్యునెట్ ఫౌండేషన్‌కు చెందిన మాస్టర్ ట్రైనర్ పి. అజయ్ రెడ్డి, వనరుల వ్యక్తి, మాట్లాడుతూ విద్యార్థులకు పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా ఆధునిక సాంకేతికతలు, కృత్రిమ మేధస్సు (AI), జనరేటివ్ AI, డేటా అనలిటిక్స్, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి రంగాల్లో ప్రాయోగిక శిక్షణ ద్వారా విద్యార్థులు సాంకేతిక నైపుణ్యాలతో పాటు సమస్యల పరిష్కార సామర్థ్యం, వినూత్న ఆలోచనా విధానం మరియు ఉద్యోగ అవకాశాలకు అవసరమైన పరిశ్రమ ప్రమాణాలపై అవగాహన పెంపొందించుకునే అవకాశం కలుగుతుందని తెలిపారు.అకాడమిక్ డైరెక్టర్ అట్లూరి వెంకటరమణ మాట్లాడుతూ నేటి ప్రపంచంలో సాంకేతిక పరిజ్ఞానం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోందని, ఈ నేపథ్యంలో విద్యార్థులు పాఠ్యాంశాలకే పరిమితం కాకుండా, కొత్త విషయాలను తెలుసుకోవడం, సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించుకోవడం, నిరంతరం నేర్చుకునే అలవాటును అలవరచుకోవడం చాలా అవసరమని, విజయవంతమైన కెరీర్‌కు క్రమశిక్షణ, అంకితభావం, సమయపాలన, కమ్యూనికేషన్ నైపుణ్యాలు, జట్టుగా పనిచేసే సామర్థ్యం మరియు సమస్యలను పరిష్కరించే దృక్పథం ఎంతో ముఖ్యమైనవని , ఈ కార్యక్రమం ద్వారా మీరు ఈ లక్షణాలను మరింత మెరుగుపరుచుకునే అవకాశం పొందుతారని తెలిపారు. ఈ కార్యక్రమానికి కళాశాలకు చెందిన కంప్యూటర్ సైన్స్ విభాగాధిపతి ఐ. నరసింహారావు, సి ఎస్ ఎం ఎ ఐ డి విభాగళపతి ఎం వెంకటేశ్వరరావు, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ విభాగాధిపతి డి రమేష్, ట్రైనింగ్ ఎంప్లాయిస్‌మెంట్ ఆఫీసర్ తివారి మన్మోహన్, అధ్యాపకులు మరియు మూడవ మరియు నాలుగవ సంవత్సర విద్యార్థినులు పాల్గొన్నారు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి