ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

కాంట్రాక్టర్ నిర్లక్ష్యం.. ప్రజాధనం వృథా..!


 క్యూరింగ్ లేక ఎండిపోతున్న సీసీ రోడ్డు

నాణ్యత పై తలెత్తుతున్న ప్రశ్నలు

ప్రజాపక్షం/ఖమ్మం రూరల్: ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని 7వ వార్డులో నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనుల్లో కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగా ప్రజాధనం వృథా అవుతుందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నగర అభివృద్ధి నిధుల కింద సుమారు రూ.18 లక్షల వ్యయంతో 160 మీటర్లకు పైగా నిర్మిస్తున్న సీసీ రోడ్డు నాణ్యతపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.సీసీ రోడ్డు నిర్మాణం అనంతరం తప్పనిసరిగా 14 రోజుల పాటు నిరంతరంగా వాటర్ క్యూరింగ్ చేపట్టాల్సి ఉండగా, కాంట్రాక్టర్ మాత్రం తూతూ మంత్రంగా నీటిని చల్లి, పైపైగా పీచు వేసి వదిలేశాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. సరైన క్యూరింగ్ లేకపోవడంతో రోడ్డు వేగంగా ఎండిపోతూ పగుళ్లు ఏర్పడే ప్రమాదం ఉందని, దీంతో లక్షల రూపాయల ప్రజాధనం వృథా అయ్యే పరిస్థితి నెలకొన్నట్లు పేర్కొంటున్నారు.ఈ విషయంపై ఏఈ అప్పారావును 'ప్రజాపక్షం' వివరణ కోరగా, కాంట్రాక్టర్‌కు ఇప్పటికే నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. వెంటనే వాటర్ క్యూరింగ్ చేపట్టించి, సీసీ రోడ్డు నాణ్యత దెబ్బతినకుండా అవసరమైన చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post a Comment (0)

కొత్తది పాతది