కప్పతో ఊరేగింపు.. చింతపల్లిలో ఆసక్తికర దృశ్యాలు
ప్రజాపక్షం / ఖమ్మం రూరల్: ఎల్ నీనో ప్రభావంతో ఈ ఏడాది ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పంటలు సకాలంలో పెరుగుదల లేక పొలాలు ఎండిపోయే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో చింతపల్లి గ్రామంలోని కొంతమంది చిన్నారులు చేసిన ప్రయత్నం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.గతంలో వర్షాలు కురవాలని కోరుతూ పల్లెల్లో ప్రత్యేక ఆచారాలు నిర్వహించేవారు. వాన దేవుడిని ప్రార్థిస్తూ పాటలు పాడటం, చిన్నపిల్లలు కప్పను కర్రకు కట్టి ఊరంతా ఊరేగిస్తూ ఇంటింటా నీళ్లు పోయించి పూజలు చేయించడం వంటి సంప్రదాయాలు గ్రామీణ జీవనంలో ఒక భాగంగా ఉండేవి. కాలక్రమేణా ఆ ఆచారాలు కనుమరుగవుతున్న తరుణంలో చింతపల్లిలో మళ్లీ అలాంటి దృశ్యం కనిపించడం గ్రామస్తుల్లో ఆసక్తిని రేకెత్తించింది.గ్రామంలో వర్షాలు పడక ప్రజలు పడుతున్న ఇబ్బందులను గమనించిన చిన్నారులు కప్పను తీసుకుని ఊరంతా తిరుగుతూ వాన కోసం ప్రార్థించారు. వారి అమాయకత్వం, వానపై ఉన్న ఆశ గ్రామస్తులను కదిలించింది. చిన్నారుల ఈ ప్రయత్నం ఫలించి త్వరలో మంచి వర్షాలు కురవాలని చింతపల్లి ప్రజలు ఆకాంక్షిస్తున్నారు.

إرسال تعليق