ప్రజలు సహకరించాలని కోరిన మున్సిపల్ కమిషనర్ ఆళ్ల శ్రీనివాస్ రెడ్డి
ప్రజాపక్షం/ఖమ్మం రూరల్: వెబ్సైట్లో ఏర్పడిన సాంకేతిక సమస్యల కారణంగా ఎదులాపురం మున్సిపాలిటీలో పలు పౌర సేవలు తాత్కాలికంగా నిలిచిపోయినట్లు మున్సిపల్ కమిషనర్ ఆళ్ల శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.కొత్త ఇండ్లకు ఇంటి నంబర్ కేటాయింపు, ఆస్తి యాజమాన్య మార్పిడి (మ్యూటేషన్), పేరు సవరణ (నేమ్ కరెక్షన్) వంటి సేవలు ప్రస్తుతం అందుబాటులో లేవని ఆయన పేర్కొన్నారు. ఈ సాంకేతిక సమస్య ఎదులాపురం మున్సిపాలిటీకే పరిమితం కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఉన్నట్లు సంబంధిత అధికారులు తెలియజేశారని చెప్పారు.సంబంధిత సమస్యను పరిష్కరించేందుకు సాంకేతిక నిపుణులు చర్యలు చేపట్టారని, సమస్య పూర్తిగా పరిష్కారమైన వెంటనే పౌర సేవలను తిరిగి ప్రారంభిస్తామని వెల్లడించారు. ఈ తాత్కాలిక అంతరాయాన్ని ప్రజలు అర్థం చేసుకుని సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి