సుమారు 200 మంది రోగులకు వైద్య పరీక్షలు – అవసరమైన వారికి ఉచిత ఆపరేషన్లకు సిఫారస్
ప్రజాపక్షం / ఖమ్మం రూరల్: సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం రామన్నపేట కాలనీ, రామన్నపేట ప్రాంతాల్లో మ్యాక్స్ విజయ కంటి ఆస్పత్రి సహకారంతో ఉచిత కంటి, దంత వైద్య శిబిరాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ శిబిరానికి సుమారు 200 మంది హాజరై కంటి, దంత పరీక్షలు చేయించుకుని వైద్యుల నుంచి తగిన సూచనలు పొందారు.పరీక్షల అనంతరం కొంతమందికి కంటి ఆపరేషన్లు అవసరమని వైద్యులు గుర్తించారు. అలాంటి వారికి ఆస్పత్రిలో ఎలాంటి పరీక్ష ఫీజు లేకుండా మరిన్ని వైద్య పరీక్షలు నిర్వహించి, తదుపరి చికిత్స అందిస్తామని వైద్య బృందం తెలిపింది.ఈ శిబిరం విజయవంతం కావడానికి సహకరించిన సిపిఐ పార్టీ, రామన్నపేట, రామన్నపేట కాలనీ ప్రజలకు నిర్వాహకులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు భోజడ్ల సూర్యరావు, పీట్ల కృష్ణమూర్తి, బోడ వీరన్న, టి. కృష్ణారావు, ఏ. కృష్ణ, దోసపాటి సాకేత్, విజయ్ తదితర నాయకులు పాల్గొన్నారు. అలాగే దోసపాటి శ్రీను, సాయికృష్ణ, నాగరాజు, సోడా నరేష్, రాంబాబు, లావణ్య, నిరోష, రాంబాయి, సృజనతో పాటు యువత, గ్రామ పెద్దలు పాల్గొన్నారు

కామెంట్‌ను పోస్ట్ చేయండి