![]() |
కాంగ్రెస్ లో రెండు వర్గాల మధ్య ఘర్షణ, తోపులాట
అర్థరాత్రి రెండు వర్గాలను చెదరగొట్టిన పోలీసులు
ప్రజాపక్షం, జూలూరుపాడు :భద్రాద్రికొత్తగూడెం జూలూరుపాడు మండలపరిధిలోని పాపకొల్లు గ్రామంలో మట్టి తోలకాల్లో అర్ధరాత్రి భగ్గుమన్న రాజకీయ కక్షలు. కాంగ్రెస్ పార్టీ నాయకుల అనుచరులతో ఇరువర్గాలు అర్ధరాత్రి ఘర్షణకుదిగడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మట్టి తోలకాల విషయంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఇరువర్గాల వారు ఒకరిపై ఒకరు ఘర్షణలకు దిగారు. గ్రామానికి చెందిన సర్పంచ్ వర్గీయలు పలు అభివృద్ధి పనుల కొరకు ట్రాక్టర్ల ద్వారా రాత్రి మట్టిని తోలుతున్న క్రమంలో అదే పార్టీకి చెందిన సర్పంచ్ గా పోటీ చేసి ఓడిన అభ్యర్థి వర్గీయలు చెందిన వారు అర్ధరాత్రి మట్టితోలకాలు ఏంటి అని అడ్డగించడం తో ఇరువర్గాల వారు అక్కడకు చేరుకుని ఘర్షణకు దిగారు. దీనితో పాపికొల్లు గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. గ్రామస్తులద్వారా సమాచారం తెలుసుకున్న జూలూరుపాడు పోలీసులు హుటా హుటిన పాపకొల్లు గ్రామానికి చేరుకున్న పోలీసులు ఇరువర్గాల వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వినకపోవడంతో పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఇదే క్రమంలో మళ్ళీ ఘర్షణలు జరిగే అవకాశం ఉందని గ్రామస్తులు బయన్దోళనలకు గురవుతున్నారు. ఓడిపోయిన అక్కసుతో అభివృద్ధి పనులను అడ్డుకుంటున్నారని సర్పంచ్ వర్గీయలు అంటుండగా, అర్థరాత్రి అక్రమ తోలకాలు ఏంటని అనుమతులు ఉంటే పట్టపగలు తోలుకోవచ్చుగా అని ప్రశ్నిస్తుంటే ఓడిపోయిన వాళ్లకు చెప్పాల్సిన అవసరం లేదంటూ అవమానిస్తున్నారు అంటు ఓడిన అభ్యర్థి వర్గీయులు చెప్తున్నారు. ఇరు వర్గాల వారు అధికార పార్టీకి చెందిన వారు కావడంతో స్థానిక ఎమ్మెల్యే రాందాస్ నాయక్ ఏం చేయాలో అర్థం కాక తలపట్టుకుంటున్నట్టు గ్రామస్తులు చర్చించుకుంటున్నారు.
రామిశెట్టి రాంబాబు కాంగ్రెస్ పార్టీ నాయకులు...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం పాపకొల్లు గ్రామస్తుడైన నేను రాంబాబు అనే వ్యక్తిని పంచాయతీ ఎన్నికల్లో గెలిపించుకొని అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుంటే ఓడిపోయిన నాటి నుండి ఓడిన నాయకుడి వర్గీయులు అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకుంటూ వివాదాలు సృష్టిస్తున్నారని. గత రాత్రి ఉన్నతాధికారుల అనుమతులతో మట్టి తోలకాలు చేపడితే కొందరు అల్లరి మూకలు మట్టి తోలుతున్న ట్రాక్టర్లకు అడ్డుపడుతూ భయాందోళనలను సృష్టిస్తున్నారని గ్రామంలో ప్రశాంతత వాతావరణాన్ని చెడగొడుతున్నారని. అర్ధరాత్రి మట్టి తోలకాలకు అడ్డుపడటంతో వివాదం జరగడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరువర్గాలను చెదరగొట్టారని తెలిపారు.
భూక్యా అమృ కాంగ్రెస్ పార్టీ నాయకులు...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం పాపకొల్లు పంచాయతీ భీమ్లా తండా నివాసినైన నేను గత స్థానిక పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థిగా రాంబాబు అనే వ్యక్తిని పోటీలో నిలిచోబెట్టానని నా మీద కక్ష గట్టి గత ఏడు నెలల నుండి నన్ను ఎన్నో రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. జనార్ధన్ అనే వ్యక్తి ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడిని. గ్రామమంత నా జేబులో పెన్ను లాంటిది అర్ధరాత్రిలో మట్టి తోలకాలు జరిపిన నన్నెవరూ ఆపేది అంటూ ఇష్టం వచ్చినట్టు బెదిరింపులకు పాల్పడుతున్నాడని. మూడుసార్లుగా దాడులకు సైతం దిగారని. అనుమతులుంటే అర్ధరాత్రి మట్టి తోలకాలు ఎందుకు అన్నందుకు ఓడిపోయిన నీకు మేం సమాధానం చెప్పాలా అంటూ దాడులకు తెగబడుతున్నారని గత ఎస్సై రవికి కంప్లైంట్ కూడా చేశానని కాంగ్రెస్ పార్టీ నాయకులు భూక్య అమృ తెలిపారు.


إرسال تعليق