ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

ఎంపీఓగా బాధ్యతలు చేపట్టిన సగ్గుర్తి కృష్ణచైతన్య


 ప్రజాపక్షం/బోనకల్: మండలంలోని ముష్టికుంట్ల గ్రామ పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్న సగ్గుర్తి కృష్ణచైతన్య మండల వంచాయతీ అధికారి(ఎంపీఓ)గా మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మండల పరిషత్ కార్యాలయంలో అధికారులు, సిబ్బంది ఆయనకు స్వాగతం పలికారు. గ్రామ పంచాయతీల పనితీరు, అభివృద్ధి కార్యక్రమాలు, పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై ప్రజలకు నాణ్యమైన సేవలు అందేలా కృషి చేస్తానని అన్నారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా అన్ని శాఖలతో సమన్వయం చేసుకుంటూ మండల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు. గ్రామ పంచాయతీల్లో నెలకొన్న సమస్యలను దశలవారీగా పరిష్కరించి, పారదర్శక పాలన అందించేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉద్యోగుల సహకారంతో ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా మండల పరిషత్ కార్యాలయ అధికారులు, సిబ్బంది, ఆయా రాజకీయపార్టీలు, ప్రజాప్రతినిధులు సగ్గుర్తి కృష్ణచైతన్యకు శుభాకాంక్షలు తెలియజేశారు

إرسال تعليق

Post a Comment (0)

أحدث أقدم