ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

కస్నా తండాలో వైరు దొంగల బీభత్సం..



 రూ.72 వేల విలువైన మీటర్ వైర్లు చోరీ

ప్రజాపక్షం/ఖమ్మం రూరల్: ఖమ్మం రూరల్ మండలం కస్నా తండాలో వైరు దొంగలు మరోసారి రెచ్చిపోయారు. రాత్రి వేళలో వ్యవసాయ బోర్లకు అమర్చిన విద్యుత్ మీటర్ వైర్లను అపహరించి రైతులకు భారీ నష్టం కలిగించారు. ఈ ఘటనలో తొమ్మిది మంది రైతులకు చెందిన సుమారు రూ.72 వేల విలువైన కరెంటు మీటర్ వైర్లు చోరీకి గురయ్యాయి.బాధిత రైతులు అజేమీరా హరిబాబు, దేవరకూడా రామనాథ్, అవిరని వెంకన్న, అవిరని వెంకటేశ్వర్లు, అవిరని వీరభద్రం, భూక్యా నాధం, వలల లక్ష్మణ్ స్వామి, అవిరని నారాయణ, అవిరని నాగరాజులు ఆకేరు పరివాహక ప్రాంతంలో సాగు చేస్తున్నారు. పంటలకు నీరందించేందుకు ఏర్పాటు చేసిన విద్యుత్ మోటార్లకు అమర్చిన మీటర్ వైర్లనే లక్ష్యంగా చేసుకుని దుండగులు చోరీకి పాల్పడ్డారని రైతులు వాపోయారు.ఆకేరు పరివాహక ప్రాంతం నిర్మానుష్యంగా ఉండటం, రాత్రి వేళల్లో ఎవరూ సంచరించకపోవడంతో దొంగలు ఈ ప్రాంతాన్ని అడ్డాగా మార్చుకున్నట్లు స్థానికులు అనుమానిస్తున్నారు. ఇటీవల తనికంపాడు ప్రాంతంలోనూ ఇదే తరహా వైరు చోరీ జరిగినట్లు సమాచారం. వరుస ఘటనలతో రైతులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.వ్యవసాయ సీజన్‌లో ఇలాంటి చోరీలు రైతులకు తీవ్ర ఆర్థిక భారం మోపుతున్నాయని ఆవేదన వ్యక్తం చేసిన వారు, రాత్రి వేళల్లో పోలీసు గస్తీని పెంచి, వైరు దొంగల ముఠాను వెంటనే పట్టుకుని కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను కోరారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post a Comment (0)

కొత్తది పాతది