ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

రైస్ మిల్లు లో విజిలెన్స్ అధికారుల తనీఖీలు ఉదయం నుంచి రాత్రి వరకు కొనసాగిన సోదాలు



 ప్రజాపక్షం /- నేలకొండపల్లి:-ఖమ్మం జిల్లా, నేలకొండపల్లి మండలం, రాజేశ్వరపురం లోని అరుణచలం రైస్ మిల్లులో రాష్ట్ర విజిలెన్స్ అధికారులు ఆకస్మికంగా తనీఖీలు చేపట్టారు. బుధవారం హైద్రాబాద్ నుంచి వచ్చిన విజిలెన్స్ అధికారుల బృందం ఉదయం నుంచి రాత్రి వరకు సోదాలు చేపట్టారు. తొలుత రైస్ మిల్లు కు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. రికార్డుల ప్రకారం ధాన్యం స్టాక్ ఉందా లేదా అని క్షేత్ర స్థాయిలో తనీఖీ చేశారు. మిల్లు కు చెందిన స్టాక్ లాట్లను లెక్కించారు. సీఎంఆర్ విషయం లో అరుణచలం రైస్ మిల్లు పై వచ్చిన పలు ఆరోపణల నేపధ్యంలో గతంలో కూడ పలుమార్లు విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. కాగా సీఎంఆర్ పెండింగ్ చెల్లించటంలో ఎందుకు' జాప్యం చేస్తున్నారు... తీసుకున్న ధాన్యం కు సంబంధించిన స్టాక్ ఉందా లేదా... ఉండి చెల్లించటం లేదా... లేక కావాలనే చెల్లింపులు చేయటం లేదా అనే విషయాల పై క్షేత్ర స్థాయిలో పరిశీలన కు వచ్చినట్లు తెలుస్తుంది. అందులో భాగంగానే విజిలెన్స్ అధికారులు విస్త్రుతంగా తనీఖీలు చేపట్టినట్లు సమాచారం. బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు జరిగిన తనీఖీలకు సంబంధించిన కవరేజీ కోసం వెళ్లిన మీడియా ను పోలీసులు అనుమతించలేదు. కనీసం ఫోటోలు కూడ తీయటానికి వీలులేదని విజిలెన్స్ డీఎస్సీ ఆంక్షలు విధించారు. అరుణచలం లో దాడుల నేపథ్యంలో మండలం లోని ఇతర రైస్ మిల్లులు ఉలిక్కిపడ్డారు.ఈ దాడులు విజిలెన్స్ డీఎస్పీ ఆధ్వర్యంలో సర్కిల్ ఇన్సెపెక్టర్స్, ఎస్సైలతో పాటు కానిస్టేబుల్స్. స్థానిక పోలీసులు, సివిల్ సప్లై అధికారులు ఈ దాడులలో పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post a Comment (0)

కొత్తది పాతది