ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

ఎదులాపురం మున్సిపాలిటీ బీజేపీ అధ్యక్షుడిగా సత్తి నాగరాజు


 ప్రజాపక్షం/ఖమ్మం రూరల్: ఎదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని గొల్లగూడెం గ్రామానికి చెందిన సత్తి నాగరాజును ఎదులాపురం మున్సిపాలిటీ బీజేపీ అధ్యక్షుడిగా నియమించారు. ఈ మేరకు బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు నెల్లూరు కోటేశ్వరరావు అధికారికంగా నియామకాన్ని ప్రకటించారు.ఈ సందర్భంగా సత్తి నాగరాజు మాట్లాడుతూ, పార్టీ తనపై ఉంచిన నమ్మకానికి తగిన విధంగా పనిచేస్తూ, మున్సిపాలిటీ పరిధిలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు. తన నియామకానికి సహకరించిన పార్టీ జిల్లా నాయకత్వానికి, నాయకులు, కార్యకర్తలు, మిత్రులు, శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలిపారు.సత్తి నాగరాజు నియామకంపై కుటుంబ సభ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, మిత్రులు, శ్రేయోభిలాషులు హర్షం వ్యక్తం చేస్తూ ఆయనకు అభినందనలు తెలిపారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post a Comment (0)

కొత్తది పాతది