ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

గోదావరిలో దూకి మహిళ ఆత్మహత్యాయత్నం..


  మత్స్యకారుల అప్రమత్తతతో తప్పిన ప్రాణాపాయం 

ప్రజాపక్షం/భద్రాచలం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం పట్టణంలో సోమవారం ఆందోళనకర ఘటన చోటుచేసుకుంది. గుర్తు తెలియని ఓ మహిళ గోదావరి నదిలోకి దూకడంతో స్థానికంగా కలకలం రేగింది.అక్కడే ఉన్న మత్స్యకారులు వెంటనే స్పందించి మహిళను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. అనంతరం ఆమెను చికిత్స నిమిత్తం భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ప్రాణాపాయం నుంచి బయటపడినట్లు సమాచారం.అయితే ఆ మహిళ ఎవరు? ఏ కారణంతో గోదావరిలోకి దూకింది? అనే విషయాలపై స్పష్టత రావాల్సి ఉంది. ఘటనపై సంబంధిత అధికారులు వివరాలు సేకరిస్తున్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post a Comment (0)

కొత్తది పాతది