ప్రజాపక్షం /కొత్తగూడెం : పాత్రికేయుల సంక్షేమం కోసం ప్రభుత్వం మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. IJU కొత్తగూడెం డివిజన్ మహాసభను బుధవారం అట్టహాసంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ...ప్రజాస్వామ్య వ్యవస్థలో మీడియా కీలక పాత్ర పోషిస్తోందని, ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడంలో పాత్రికేయులు నిరంతరం పనిచేస్తున్నారని పేర్కొన్నారు.పాత్రికేయులు అనేక సవాళ్ల మధ్య తమ వృత్తిని కొనసాగిస్తున్నారని, వారి శ్రమకు తగిన గుర్తింపు, భద్రత మరియు సంక్షేమం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా మీడియా రంగంలో పనిచేస్తున్న వారికి కనీస వేతన చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.పాత్రికేయులకు ఉద్యోగ భద్రత, ఆరోగ్య పరిరక్షణ, సంక్షేమ పథకాలు, అవసరమైన సౌకర్యాలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వం పాత్రికేయుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి పెట్టి వారి సమస్యల పరిష్కారానికి ముందుకు రావాలని అన్నారు.పాత్రికేయ వృత్తి సమాజ నిర్మాణంలో కీలకమైనదని, వారి సేవలను గౌరవించే విధంగా ప్రభుత్వ విధానాలు ఉండాలని ఎమ్మెల్యే కూనంనేని పేర్కొన్నారు.
పాత్రికేయుల సంక్షేమం కోసం ప్రభుత్వం మరింత బాధ్యతగా వ్యవహరించాలి
byThe News Desk
-
0

కామెంట్‌ను పోస్ట్ చేయండి