వి.బి.జి – రామ్‌జీ రద్దు చేయకపోతే ఉద్యమాలు తప్పవు: సీఐటీయూ
ప్రజాపక్షం / ఖమ్మం రూరల్ : కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వి.బి.జి – రామ్‌జీ విధానాన్ని తక్షణం రద్దు చేయాలని సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యులు పెరుమాళ్లపల్లి మోహన్‌రావు డిమాండ్ చేశారు. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యథావిధిగా కొనసాగించాలని, లేకపోతే కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులను ఐక్యం చేసి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.అఖిల భారత స్థాయిలో సీఐటీయూ, వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా గ్రామపంచాయతీల ముందు ధర్నాలు నిర్వహించి, పంచాయతీ కార్యదర్శులు, సర్పంచ్‌లకు వినతిపత్రాలు అందజేయాలని ఇచ్చిన పిలుపు మేరకు ఖమ్మం రూరల్ మండలంలోని చింతపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.అనంతరం పంచాయతీ కార్యదర్శి ఎల్. వీరేందర్, సర్పంచ్ ఆరెంపుల మరియమ్మకు వినతిపత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యులు పెరుమాళ్లపల్లి మోహన్‌రావు, పంచాయతీ ఉపసర్పంచ్ సూదగాని విజయలక్ష్మి, అంగన్వాడీ టీచర్ పద్మ, పంచాయతీ వర్కర్ మునేష్, ఆశా వర్కర్ లలిత, కెవిపిఎస్ ఖమ్మం రూరల్ మండల అధ్యక్షుడు, వార్డు సభ్యులు ఆరెంపుల ఉప్పలయ్య, మాజీ ఎంపీపీ పగిళ్ల వీరభద్రం, రైతు సంఘం మండల నాయకులు సూదగాని యల్లయ్య, సూదగాని హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి