ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

టెక్స్‌టైల్ రంగ అభివృద్ధికి కేంద్రం తీసుకుంటున్న చర్యలేంటి..?


 తెలంగాణలో చేనేత రంగానికి అందుతున్న ప్రోత్సాహకాలేమిటి..?

లోక్‌సభలో ప్రశ్నించిన ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి 

సమాధానమిచ్చిన కేంద్ర జౌళి శాఖ సహాయ మంత్రి 

ప్రజాపక్షం/ఖమ్మం రూరల్: టెక్స్ టైల్స్ రంగ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో తెలపాలని ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురాం రెడ్డి లోక్ సభలో ప్రశ్నించారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా మంగళవారం టెక్స్‌టైల్ రంగానికి సంబంధించి కీలక ప్రశ్నలు సంధించారు. తెలంగాణలో ఆమోదించిన చేనేత-పవర్‌లూమ్ రంగాలకు అందుతున్న కేంద్ర సహాయం, ఎగుమతుల ప్రోత్సాహం మరియు కార్మికుల సామాజిక భద్రతపై ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు. కేంద్ర జౌళి శాఖ సహాయ మంత్రి పబిత్ర మార్గెరిటా లిఖిత పూర్వకంగా సమాధానమిచ్చారు. 

తెలంగాణలో రెండు ఎస్ఐటీపీ పార్కుల ఏర్పాటు...

యాదాద్రి భువనగిరి జిల్లాలోని పోచంపల్లి హ్యాండ్లూమ్ పార్క్ ద్వారా 189 యూనిట్లు, రంగారెడ్డి జిల్లాలోని వైట్ గోల్డ్ టెక్స్‌టైల్ పార్క్ ద్వారా 10 యూనిట్లు పూర్తయి వాణిజ్య కార్యకలాపాలు సాగిస్తున్నాయని వివరించారు. వరంగల్‌లో 'పీఎం మిత్రా' మెగా టెక్స్‌టైల్ పార్కు ద్వారా రూ. 3,862 కోట్ల పెట్టుబడులతో 24,500 మందికి ఉపాధి లభించిందని పేర్కొన్నారు.  

చేనేత క్లస్టర్ల అభివృద్ధి ఇలా...

తెలంగాణ ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు 2021-26 మధ్య కాలంలో చిన్న క్లస్టర్ అభివృద్ధి కార్యక్రమాల(SCDPs) కింద 26 క్లస్టర్లు మంజూరయ్యాయని మంత్రి తెలిపారు. దీనికోసం కేంద్రం రూ. 1,223.97 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించగా, ప్రత్యక్షంగా 4,971 మంది చేనేత కార్మికులు లబ్ధి పొందారని స్పష్టం చేశారు.  మోడిఫైడ్ గ్రూప్ వర్క్‌షెడ్ పథకం (GWSS) కింద 1 ప్రాజెక్టు మంజూరు కాగా రూ. 13.04 లక్షల గ్రాంటులో రూ. 7.82 లక్షలు విడుదలయ్యాయన్నారు. మార్జిన్ మనీ సబ్సిడీ (MMS) కింద 149 ప్రాజెక్టులు పూర్తయి రూ. 159.01 లక్షల సబ్సిడీ, ATUFS కింద 16 ప్రాజెక్టులకు రూ. 55.91 కోట్ల సబ్సిడీ విడుదలైనట్లు తెలిపారు. 11,719 మగ్గాలు/కిట్లకు రూ. 1,252.36 లక్షల సబ్సిడీ అందజేసినట్లు తెలిపారు.

​కార్మికుల సంక్షేమం, నిధులు...

మూతపడిన 4 మిల్లులకు సంబంధించి టెక్స్‌టైల్స్ వర్కర్స్ రిహాబిలిటేషన్ ఫండ్ (TWRFS) కింద 643 కార్మికులకు రూ.3.19 కోట్లు పంపిణీ చేశామని, హైదరాబాద్ సర్వీస్ సెంటర్ ద్వారా 1,586 ట్రెయినీలకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇచ్చామని, కామన్ ఫెసిలిటీస్ సెంటర్ (CFC) కోసం రూ.2కోట్లు, నూలు బ్యాంకు కార్పస్ ఫండ్ కొరకు రూ. 1.98 కోట్లు విడుదల చేశారమని తెలిపారు.

బీమా, ఉపకార వేతనాలతో ప్రోత్సాహకం...

గ్రూప్ ఇన్సూరెన్స్ పథకం (GIS) కింద 54,387 మంది నమోదు కాగా, సహజ మరణాలకు సంబంధించి 262 క్లెయిమ్స్‌ కింద రూ. 2,19,50,000, ఎస్‌ఎస్‌వై కింద 4,902 మంది విద్యార్థులకు రూ. 58,72,800 ఉపకార వేతనాలు పంపిణీ అయ్యాయని తెలిపారు. తెలంగాణ ఎగుమతిదారులతో సహా అందరికీ RoSCTL, RoDTEP, EPCG వంటి ఎగుమతి ప్రోత్సాహక పథకాలు అమల్లో ఉన్నాయనిమంత్రి తెలిపారు. 2026-27 లో సంప్రదాయ క్లస్టర్ల ఆధునికీకరణకు కృషి చేస్తున్నట్లు కేంద్ర మంత్రి వివరించారు.

إرسال تعليق

Post a Comment (0)

أحدث أقدم