ఏఐవైఎఫ్ మండల మహాసభల్లో మామిండ్ల శ్రీనాథ్ రెడ్డి
ప్రజాపక్షం/నేలకొండపల్లి : గంజాయి, డ్రగ్స్, మద్యం వంటి దురలవాట్లకు యువత దూరంగా ఉండి, భగత్‌సింగ్ ఆశయాలతో పోరాట స్ఫూర్తిని పెంపొందించుకోవాలని ఏఐవైఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి మామిండ్ల శ్రీనాథ్ రెడ్డి పిలుపునిచ్చారు. భైరవునిపల్లిలో జరిగిన ఏఐవైఎఫ్ 22వ మండల మహాసభల్లో ఆయన మాట్లాడుతూ నిరుద్యోగం, పేపర్ లీకేజీలు, విద్యా సమస్యలపై యువత ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఉద్యమించాలని సూచించారు. ఎన్టీఏ రద్దు, ఎన్ఈపీ–2020 ఉపసంహరణ, ఖాళీ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీని డిమాండ్ చేశారు.మహాసభ అనంతరం ఏఐవైఎఫ్ నూతన మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పాలపాటి అశోక్ ప్రధాన కార్యదర్శిగా, ఆలేటి ఉమామహేష్ అధ్యక్షుడిగా, పెదపాక నాగరాజు సహాయ కార్యదర్శిగా, గోపినాథ్ ఉపాధ్యక్షుడిగా వీరితో పాటు 19మంది కౌన్సిల్ సభ్యులు ఎన్నికయ్యారు. కార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శి మారిశెట్టి వేంకటేశ్వరరావు,ఏఐవైఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శిలు చింతల రమేష్, మల్లెబోయిన ఉపేందర్, సిపిఐ గ్రామ శాఖ కార్యదర్శి బాలిన కృష్ణంరాజు సహాయ కార్యదర్శి భద్రజీ వేంకటేశ్వరరావు సిపిఐ సినీయర్ నాయకులు కనకబండి రామయ్య యువ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.


إرسال تعليق