![]() |
| ఫైల్ ఫోటో |
నివాళులర్పించిన సిపిఐ జిల్లా కార్యదర్శి దండి సురేష్
ప్రజాపక్షం/ఖమ్మం రూరల్ : ఎదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని 28వ వార్డుకు చెందిన సిపిఐ మాజీ వార్డ్ మెంబర్, మండల సమితి సభ్యుడు షేక్ రజబెల్లి కుమారుడు మైబల్ సాబ్(38) అనారోగ్యంతో బుధవారం ఇంటి వద్ద మృతి చెందాడు. విషయం తెలుసుకున్న సిపిఐ జిల్లా కార్యదర్శి దండి సురేష్, ఖమ్మం రూరల్ మండలం సమితి సభ్యులు మృతదేహాన్ని సందర్శించి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు మిడకంటి చిన్న వెంకటరెడ్డి, సిపిఐ జిల్లా సమితి సభ్యుడు వెంపటి సురేందర్, సిపిఐ మండల కార్యదర్శి పుచ్చకాయల సుధాకర్, 28వ వార్డు కౌన్సిలర్ దండి రంగారావు, 28, 29,30 డివిజన్ల సిపిఐ కార్యదర్శులు లగిశెట్టి రమేష్ , వెంపటి రాము , బియ్యాల రాజు తదితరులు పాల్గొన్నారు.


إرسال تعليق