ఎస్ క్యూ ఐ లో పాస్టర్ల సంక్షేమమే మా ధ్యేయం
ఇండియా.బిషప్.రమేష్ బాలన్ వెల్లడి
బిషప్ లుగా సుందర్ పాల్,డేవిడ్ రాజు ను అభిషేకించిన
ఎస్ క్యూ ఐ భారతదేశం బిషప్.రమేష్ బాలన్
ప్రజాపక్షం/నేలకొండపల్లి : భారతదేశంలో సేవకులు కొరకు ఎస్ క్యూ ఐ సంస్థ మ్యారేజి సర్టిఫికెట్స్ తో పాటు అన్ని విషయాల్లో సహకారంగా ఉంటుందని భారతదేశపు బిషప్ రమేష్ బాలన్ వెల్లడించారు.మండల పరిధిలోని పైనంపల్లి గ్రామంలో కల్వరి ప్రార్థన మందిరంలో బిషప్. సూరేపల్లి సుందర పాల్ ఆధ్వర్యంలో మంగళవారం 35 మంది పాస్టర్స్ కు మ్యారేజి లైసెన్స్ సర్టిఫికెట్స్ అందించడం జరిగింది.ఈ కార్యక్రమంలో పాస్టర్ డేవిడ్ రాజు వడ్లమూడి,పాస్టర్ సూరేపల్లి సుందర పాల్ కి దైవ దాసులు సమక్షంలో ఎస్ క్యూ ఐ భారతదేశపు బిషప్ రమేష్ బాలన్,ఇరువురిని ఐదు రాష్ట్రాల బిషప్.జి.ప్రకాశం, తెలంగాణ రాష్ట్ర బిషప్ సామ్యూల్ సన్ సమక్షంలో అభిషేకించి బిషప్ లు గా ఆశీర్వదించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... భారతదేశంలో ఎస్ క్యూ ఐ సమస్త సేవకుల సంక్షేమం కొరకు పనిచేస్తుందని వెల్లడించారు.సేవకులు సంఘాలలో వివాహాలు జరిపించడానికి ఎస్ క్యూ ఐ ద్వారా మ్యారేజి సర్టిఫికెట్స్ అందిస్తున్నట్లు తెలిపారు.రాష్ట్రవ్యాప్తంగా ఎస్ క్యూ ఐ ద్వారా అందిస్తున్న సేవలను అభినందించారు.ఈ కార్యక్రమంలో 35 మంది సేవకులు వివాహాలు చేయుటకు విలువైన సర్టిఫికెట్స్ ను పొందారు.

إرسال تعليق