ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

ఈత–తాటి చెట్ల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత: ఎస్సై ఎం. సరిత


 ప్రజాపక్షం/ఖమ్మం రూరల్:ఈత, తాటి చెట్లు పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయని ఎక్సైజ్ ఎస్ ఐ ఎం సరిత అన్నారు. బుధవారం ఖమ్మం రూరల్ మండలం తీర్థాల గ్రామంలో పర్యావరణ పరిరక్షణతో పాటు ఈత–తాటి వనరుల అభివృద్ధికై ఈత, తాటి మొక్కలను నాటారు.ఈ సందర్భంగా ఎస్సై ఎం. సరిత మాట్లాడుతూ... ఈ మొక్కలను నాటి వదిలేయకుండా సంరక్షించడం కూడా ప్రతి ఒక్కరి బాధ్యత అని సూచించారు. గీత కార్మికుల జీవనోపాధికి ఈత, తాటి చెట్లు ఎంతో ఉపయోగపడతాయని, భవిష్యత్ తరాలకు ఈ సంపదను అందించేందుకు అందరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో చేపడుతున్న మొక్కల పెంపకం కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర సొసైటీ అధ్యక్షుడు కొండం కరుణాకర్, ఎక్సైజ్ కానిస్టేబుల్ బి. శైలజ, రవిబాబు, నరేందర్, ప్రతాప్, నాగేశ్వరరావు, సర్పంచ్ శైలజ, గ్రామ కార్యదర్శి జ్యోతి, ఫీల్డ్ అసిస్టెంట్ శంకర్, శ్రీను, శంకర్, వెంకటేశ్వర్లు, సంగయ్య, కొండయ్య, నాగేందర్, కృష్ణ, ఉపేందర్, సత్యం తదితర గీత కార్మికులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post a Comment (0)

కొత్తది పాతది