ప్రజాపక్షం/ఖమ్మం రూరల్: ఆధునిక సాంకేతిక రంగంలో కీలకంగా మారుతున్న కృత్రిమ మేధస్సు (AI)పై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ఖమ్మం పొన్నేకల్‌లోని శ్రీ చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & రీసెర్చ్‌లో నాలుగు రోజుల వర్క్‌షాప్‌ను బుధవారం ప్రారంభించారు. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో ఐబీఎం స్కిల్స్‌బిల్డ్ ప్రోగ్రాం సహకారంతో "ఏఐ టూల్స్ & అప్లికేషన్స్" అంశంపై ఈ శిక్షణ కార్యక్రమం చేపట్టారు.ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ మల్లెంపాటి శ్రీధర్ మాట్లాడుతూ, కృత్రిమ మేధస్సులో వస్తున్న తాజా పరిణామాలు, పరిశ్రమల్లో ఏఐ వినియోగం, జనరేటివ్ ఏఐ, ప్రాంప్ట్ ఇంజనీరింగ్, ఏఐ ఆధారిత కెరీర్ అవకాశాలపై విద్యార్థులకు సమగ్ర అవగాహన కల్పించేందుకు ఈ వర్క్‌షాప్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.ఐబీఎం స్కిల్స్‌బిల్డ్ తెలంగాణ హెడ్ రాఘవేంద్ర గుప్తా మాట్లాడుతూ, సాంకేతిక రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యార్థులు తమ నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. భవిష్యత్ ప్రపంచాన్ని ఏఐ సాంకేతికత ప్రభావితం చేయనుందని, ఏఐ ఆధారిత నైపుణ్యాలను అభివృద్ధి చేసుకుంటే ప్రపంచ స్థాయి అవకాశాలను అందిపుచ్చుకోవచ్చని తెలిపారు. ఐబీఎం స్కిల్స్‌బిల్డ్ వంటి కార్యక్రమాలు విద్యార్థుల కెరీర్‌కు బలమైన పునాది వేస్తాయని పేర్కొన్నారు.కళాశాల డైరెక్టర్ శ్రీమతి శ్రీ విద్య మాట్లాడుతూ, ప్రస్తుత ఉద్యోగ ప్రపంచంలో డిగ్రీతో పాటు సాంకేతిక నైపుణ్యాలు ఎంతో అవసరమని, ఈ వర్క్‌షాప్ ద్వారా విద్యార్థులు పరిశ్రమ అవసరాలకు అనుగుణమైన ప్రాక్టికల్ నాలెడ్జ్ పొందుతారని తెలిపారు.ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాయి గీతిక మాట్లాడుతూ, ఐబీఎం స్కిల్స్‌బిల్డ్ అందించే కోర్సులు, సర్టిఫికేషన్లు, డిజిటల్ క్రెడెన్షియల్స్‌ను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ప్రిన్సిపాల్ డా. జె. లక్ష్మీనారాయణ మాట్లాడుతూ విద్యార్థులు వర్క్‌షాప్‌లో నేర్చుకునే అంశాలను విద్య, పరిశోధన, ఆవిష్కరణల్లో సమర్థవంతంగా వినియోగించుకోవాలని కోరారు. డీన్ డాక్టర్ వి. సుదర్శన్ మాట్లాడుతూ సాంకేతిక పరిజ్ఞానంతో పాటు సృజనాత్మకత, సమస్య పరిష్కార సామర్థ్యాలను విద్యార్థులు పెంపొందించుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ వైశాలి, ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఆఫీసర్ డాక్టర్ రాజేష్, డిప్లొమా ఇన్చార్జి కృష్ణ ప్రసాద్, వివిధ విభాగాల అధిపతులు, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి