ప్రజాపక్షం/ఖమ్మం : ఖమ్మం జిల్లా మరియు పరిసర ప్రాంతాల నుండి బెంగళూరు నగరానికి ప్రయాణించే దూరప్రాంత బస్సు ప్రయాణికులకు శుభవార్త తెలిపింది. ప్రయాణికులకు మరింత మెరుగైన సౌకర్యాలు, సులభమైన రవాణా సేవలను అందించేందుకు బెంగళూరు నగరంలో బోర్డింగ్ (బస్సు ఎక్కే) మరియు అలైటింగ్ (దిగే) పాయింట్లను భారీగా పెంచింది.
బోర్డింగ్ మరియు అలైటింగ్ పాయింట్లు: దేవనహళ్లి బైపాస్, బెంగళూరు ఎయిర్పోర్ట్ టోల్ ప్లాజా, ఎలాహంక, ఎస్టీమ్ మాల్, హెబ్బల్, సిబిఐ జంక్షన్, ప్యాలెస్ గుట్టహల్లి, ఆనందరావు సర్కిల్, కెంపెగౌడ బస్ స్టేషన్ (మెజెస్టిక్), యశ్వంతపూర్ మెట్రో స్టేషన్, పీనియా ప్రాంతాల్లో ప్రయాణికులకు ఎక్కే–దిగే సౌకర్యం కల్పించబడింది.ఈ సదవకాశాన్ని ప్రయాణికులు వినియోగించుకుని TGSRTC బస్సుల్లో సౌకర్యవంతంగా ప్రయాణించాలని సంస్థ సూచించింది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి