సభకు తరలివస్తున్న రైతులు ప్రజలను ఆకర్షిస్తున్న వైనం
ప్రజాపక్షం / చింతకాని:ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొంటున్న రైతు ఆశీర్వాద సభకు ముందు ఖమ్మం జిల్లా చింతకాని మండలం మత్కేపల్లి క్రాస్ రోడ్ వద్ద ఆసక్తికర రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. సీఎం, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు స్వాగతం పలుకుతూ కాంగ్రెస్ శ్రేణులు ఏర్పాటు చేసిన భారీ ఫ్లెక్సీల్లో మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డితో పాటు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిలువెత్తు చిత్రాలను కూడా పొందుపరచడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తున్న అధికారిక ప్రాధాన్యం కలిగిన సభకు వెళ్లే ప్రధాన మార్గంలోనే ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు కావడం విశేషం. సభకు తరలివస్తున్న వేలాది మంది రైతులు, కార్యకర్తలు, ప్రజల దృష్టిని అవి ఆకర్షించాయి. ఫ్లెక్సీల వద్ద పలువురు ఆగి చర్చించుకోవడం కనిపించిందిఒకవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ఆశీర్వాద సభను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తుండగా, మరోవైపు అదే సభా మార్గంలో వైఎస్ జగన్ చిత్రాలు దర్శనమివ్వడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారసత్వాన్ని గుర్తు చేసే ఉద్దేశంతోనే జగన్ చిత్రాలను కూడా చేర్చారా? లేక స్థానిక నాయకుల నిర్ణయమా? అనే అంశంపై రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.ఈ ఫ్లెక్సీలు ప్రస్తుతం సభా ప్రాంగణం కంటే ఎక్కువగా రాజకీయ వర్గాల దృష్టిని ఆకర్షిస్తూ హాట్ టాపిక్‌గా మారాయి.

إرسال تعليق