ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

ఖమ్మం రూరల్‌లో అక్రమ ఇసుక మాఫియా రెచ్చిపోతోంది..!


👉 మున్నేరు, ఆకేరు నుంచి యథేచ్ఛగా ఇసుక తరలింపు

👉 ఒక్కో ట్రాక్టర్ ఇసుక రూ.8 వేల వరకు విక్రయం

👉 ప్రభుత్వ ఆదాయానికి భారీ గండి.. అధికారుల తీరుపై విమర్శలు

ప్రజాపక్షం/ ఖమ్మం రూరల్:ఖమ్మం రూరల్ మండలంలో అక్రమ ఇసుక తవ్వకాలు రోజురోజుకూ పెరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తీర్థాల, కస్నాతండా, గూడురుపాడు, తనగంపాడు ప్రాంతాల్లోని మున్నేరు, ఆకేరు వాగుల నుంచి రేయింబవళ్లు ట్రాక్టర్ల ద్వారా ఇసుకను తరలిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు.నిర్మాణ రంగంలో ఇసుకకు డిమాండ్ పెరగడంతో ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకుని అక్రమ వ్యాపారం జోరుగా సాగుతోందని సమాచారం. రాజీవ్ గృహకల్ప, పోలేపల్లి, ఏదులాపురం ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఇసుక డంపులు ఏర్పాటు చేసి, అక్కడి నుంచి ఒక్కో ట్రాక్టర్ ఇసుకను రూ.8 వేల వరకు విక్రయిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

నిబంధనలకు తూట్లు...

నిబంధనల ప్రకారం ఇసుక తరలింపుకు మైనింగ్, రెవెన్యూ శాఖల అనుమతులు తప్పనిసరి. అయితే ఎలాంటి అనుమతులు లేకుండానే అక్రమంగా ఇసుక తవ్వకాలు, రవాణా కొనసాగుతున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. తనిఖీలు జరిగితే పాత అనుమతి పత్రాలు చూపించి తప్పించుకుంటున్నారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.

ప్రభుత్వ ఆదాయానికి నష్టం...

అక్రమ ఇసుక తవ్వకాల వల్ల ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం కోల్పోతుండటమే కాకుండా సహజ వనరులు దెబ్బతింటున్నాయి. గ్రామపంచాయతీలకు రావాల్సిన సెస్ ఆదాయం కూడా తగ్గిపోతుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి అక్రమ ఇసుక తవ్వకాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

إرسال تعليق

Post a Comment (0)

أحدث أقدم