ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

నాడు నిత్య శ్రామికుడిగా ప్రజా ఉద్యమాలు.. నేడు కౌన్సిలర్ గా ప్రజా సేవ


 28వ వార్డు స్వచ్ఛత–అభివృద్ధిలో ముందున్న సీపీఐ కౌన్సిలర్ దండి రంగారావు

స్వయంగా బ్లీచింగ్ చల్లి పారిశుధ్య కార్యక్రమంలో కార్మికులతో కలిసి భాగస్వామ్యం

ప్రజాపక్షం/ఖమ్మం రూరల్:ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తున్న 28వ వార్డు సీపీఐ కౌన్సిలర్ దండి రంగారావు మరోసారి తన సేవా తీరును చాటుకున్నారు. సీపీఐ నాయకుడిగా.. నిత్య శ్రామికుడిగా ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడిన ఆయన.. ప్రస్తుతం కౌన్సిలర్‌గా వార్డు అభివృద్ధి, పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు.స్వచ్ఛ మున్సిపాలిటీ కార్యక్రమంలో భాగంగా తన 28వ వార్డులో వీధుల పరిశుభ్రతకు చర్యలు చేపట్టడమే కాకుండా, స్వయంగా బ్లీచింగ్ పౌడర్ చల్లి పారిశుధ్య కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యలను తెలుసుకోవడం, వాటి పరిష్కారానికి కృషి చేయడం తన బాధ్యతగా భావిస్తున్నానని కౌన్సిలర్ తెలిపారు.పదవి అనేది ప్రజలకు సేవ చేసేందుకు వచ్చిన బాధ్యత అని భావిస్తున్న దండి రంగారావు.. అధికారులు, పారిశుధ్య సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ వార్డు అభివృద్ధికి కృషి చేస్తున్నారు. కేవలం సూచనలు ఇవ్వడానికే పరిమితం కాకుండా, స్వయంగా కార్యక్రమాల్లో పాల్గొనడం పట్ల స్థానికులు అభినందనలు వ్యక్తం చేస్తున్నారు.

إرسال تعليق

Post a Comment (0)

أحدث أقدم