ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

ప్రియదర్శిని మహిళా కళాశాలలో ఎన్‌డీఆర్‌ఎఫ్ ఆధ్వర్యంలో విపత్తు నిర్వహణ శిక్షణ



 ప్రజాపక్షం / ఖమ్మం రూరల్: ఎదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని ప్రియదర్శిని మహిళ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్ (స్వయంప్రతిపత్తి కళాశాల)లో ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో జాతీయ విపత్తు స్పందన దళం (ఎన్‌డీఆర్‌ఎఫ్) సెంట్రల్ టీమ్ సహకారంతో విపత్తు నిర్వహణ సామర్థ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమం శనివారం నిర్వహించారు.ఈ సందర్భంగా విద్యార్థులకు అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలను రక్షించేందుకు అవసరమైన సీపీఆర్ (CPR) హ్యాండ్స్-ఆన్ శిక్షణతో పాటు రక్తస్రావ నియంత్రణ (Bleeding Control), ప్రథమ చికిత్స పద్ధతులపై ప్రాయోగికంగా అవగాహన కల్పించారు.కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కళాశాల చైర్మన్ కాటేపల్లి నవీన్ బాబు మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యాలు, రోడ్డు ప్రమాదాలు వంటి అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్సపై ప్రతి ఒక్కరికీ అవగాహన అవసరమన్నారు. విద్యార్థులు విద్యతో పాటు సామాజిక బాధ్యతను పెంపొందించుకుని, అవసరమైన సమయంలో సమయస్ఫూర్తితో స్పందించే నైపుణ్యాలను అలవర్చుకోవాలని సూచించారు.కళాశాల ప్రిన్సిపాల్ డా. బి. గోపాల్ మాట్లాడుతూ నాణ్యమైన విద్యతో పాటు జీవిత నైపుణ్యాలను అందించడం కూడా విద్యాసంస్థల బాధ్యతేనని అన్నారు. సీపీఆర్, రక్తస్రావ నియంత్రణ వంటి ప్రథమ చికిత్సా పద్ధతులపై అవగాహన ఉంటే ప్రమాద సమయంలో విలువైన ప్రాణాలను కాపాడే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.డీఈఓ ఇన్‌చార్జ్ జి. సదానందం మాట్లాడుతూ విపత్తులు ముందస్తు హెచ్చరిక లేకుండానే సంభవిస్తాయని, అందువల్ల ప్రతి ఒక్కరూ అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. రూరల్ ఎంఆర్‌వో ఎం. వినయ్ రెడ్డి మాట్లాడుతూ విపత్తు నిర్వహణలో ప్రభుత్వ యంత్రాంగంతో పాటు ప్రజల భాగస్వామ్యం కూడా కీలకమని, విద్యార్థులు నేర్చుకున్న నైపుణ్యాలను సమాజ సేవలో వినియోగించాలని కోరారు.అకాడమిక్ డైరెక్టర్ అట్లూరి వెంకటరమణ మాట్లాడుతూ ఇటువంటి శిక్షణా కార్యక్రమాలు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి, అత్యవసర పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనే సామర్థ్యాన్ని పెంచుతాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో వివిధ విభాగాల అధిపతులు, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ వి. శివరామకృష్ణ, అధ్యాపకులు, ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమంలో నిర్వహించిన ప్రాయోగిక శిక్షణ విద్యార్థుల్లో విపత్తు నిర్వహణపై అవగాహన పెంపొందించడంతో పాటు అత్యవసర పరిస్థితుల్లో సమర్థవంతంగా స్పందించే జీవన నైపుణ్యాలను అభివృద్ధి చేయడంలో ఉపయోగకరంగా నిలిచింది.

إرسال تعليق

Post a Comment (0)

أحدث أقدم