ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

విపత్తుల సమయంలో అప్రమత్తతపై అవగాహన కార్యక్రమం



 

ప్రియదర్శిని ఇంజనీరింగ్ కళాశాలలో ఎన్‌డీఎంఏ ఆధ్వర్యంలో డెమో నిర్వహణ

ప్రజాపక్షం/ఖమ్మం రూరల్: ఏదులాపురం మున్సిపాలిటీ ఆధ్వర్యంలో జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ) ప్రియదర్శిని ఇంజనీరింగ్ కళాశాలలో ప్రజలకు విపత్తుల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు.ఈ సందర్భంగా భూకంపాలు, అగ్ని ప్రమాదాలు, వరదలు వంటి విపత్తులు సంభవించినప్పుడు ప్రజలు ఎలా అప్రమత్తంగా ఉండాలి, ప్రాణ నష్టాన్ని ఎలా తగ్గించుకోవాలి అనే అంశాలపై నిపుణులు అవగాహన కల్పించారు.అలాగే విపత్తుల సమయంలో రక్షణ చర్యలు, ప్రాథమిక సహాయం అందించే విధానాలను ప్రాక్టికల్‌గా ప్రదర్శించి విద్యార్థులు, ప్రజలకు వివరించారు. అత్యవసర పరిస్థితుల్లో ధైర్యంగా వ్యవహరిస్తూ సరైన నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ వినయేందర్ రెడ్డి, కమీషనర్ ఆళ్ల శ్రీనివాస్ రెడ్డి, విద్యుత్ శాఖ ఏఈ జిల్లా ప్రభాకర్ రావు, చైర్ పర్సన్ పోకబత్తిని అనిత, వైస్ చైర్మన్ తమ్మినేని నవీన్, కౌన్సిలర్లు, మున్సిపాలిటీ అధికారులు, కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

إرسال تعليق

Post a Comment (0)

أحدث أقدم