ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

మృతుల కుటుంబాలకు కందాళ పరామర్శ.. బాధితులకు భరోసా


 ప్రజాపక్షం/ఖమ్మం రూరల్‌: ఇటీవల మృతి చెందిన పలువురు కుటుంబాలను పాలేరు మాజీ ఎమ్మెల్యే శ్రీ కందాళ ఉపేందర్ రెడ్డి బుధవారం పరామర్శించారు. ఖమ్మం రూరల్ మండలం ముత్తగూడెం గ్రామంలో కాసాని రాములు, మేకల నాగేశ్వరరావు కుటుంబాలను కలిసి ప్రగాఢ సానుభూతి తెలిపారు.అనంతరం గొల్లగూడెం గ్రామంలో యాట వెంకటమ్మ, మలీదు వెంకట సిద్ధయ్య కుటుంబాలను పరామర్శించి, కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఆరేంపుల గ్రామంలో మాజీ జడ్పీటీసీ పెరుమాళ్ళపల్లి మోహన్ రావు సతీమణి కళావతి మృతికి సంతాపం వ్యక్తం చేస్తూ ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.అదేవిధంగా విద్యుత్ షాక్‌తో మృతి చెందిన మేడా రవీందర్, షేక్ పెంట్ మియా కుటుంబాలను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. నాయుడుపేటలో ఇటీవల మరణించిన అకిటి వెంకటేశ్వర్లు కుటుంబాన్ని పరామర్శించారు.అభయ టౌన్‌షిప్‌లో అనారోగ్యంతో బాధపడుతున్న సోమనపల్లి మల్లయ్యను కలిసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని, బాధితులకు తన సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని కందాళ ఉపేందర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా టిఆర్ఎస్ నాయకుడు బెల్లం వేణు మున్సిపాలిటీ నాయకులు బానోతు మోహన్ , బానోతు కృష్ణ , బానోతు వీరన్న, వెంపటి ఉపేందర్,  ఖమ్మం రూరల్ మండల నాయకులు ముత్యం పెద్ద కృష్ణారావు మట్ట వెంకటేశ్వర్లు, జరుపుల లక్ష్మణ్ నాయక్, భార్గవ్ , కందాల సోషల్ మీడియా ఉదయ్ తదితరులు పాల్గొన్నారు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post a Comment (0)

కొత్తది పాతది