ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

పోస్టు ద్వారా ముఖ్యమంత్రికి కేజీబీవీ, యూఆర్ఎస్ సమస్యలపై వినతి


 ప్రజాపక్షం/ఖమ్మం రూరల్:టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కేజీబీవీ, యూఆర్ఎస్ ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పోస్టు ద్వారా వినతిపత్రం పంపించారు. ఖమ్మం అర్బన్ మండలంలోని వెలుగుమట్ల కేజీబీవీ, యూఆర్ఎస్ ఉపాధ్యాయులతో కలిసి టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పారుపల్లి నాగేశ్వరరావు, జిల్లా ట్రెజరర్ వల్లంకొండ రాంబాబు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ విషయాన్ని ఖమ్మం అర్బన్ మండల ప్రధాన కార్యదర్శి బియ్యని కృష్ణయ్య బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.వినతిపత్రంలో కేజీబీవీ, యూఆర్ఎస్ ఉపాధ్యాయులకు టైమ్ స్కేల్ అమలు చేసి రెగ్యులర్ చేయాలని, రెగ్యులర్ ఉపాధ్యాయులతో సమానంగా సెలవులు కల్పించాలని, కేర్‌టేకర్లను నియమించాలని, గత ఏడాది 29 రోజుల సమ్మె కాలానికి సంబంధించిన వేతనాలను మంజూరు చేయాలని, ఉపాధ్యాయులను బోధనా కార్యక్రమాలకే పరిమితం చేయాలని, ఆరోగ్య కార్డులు, పీఆర్సీ అమలు చేయాలని, 010 విధానం ద్వారా ప్రతి నెలా సకాలంలో జీతాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి విదితతో పాటు కేజీబీవీ, యూఆర్ఎస్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

إرسال تعليق

Post a Comment (0)

أحدث أقدم