డాడీ లంబాడి కుటుంబాల కృతజ్ఞతలు.. రెండు ఎకరాల భూమి కేటాయింపుపై హర్షం
ప్రజాపక్షం / ఖమ్మం రూరల్ : ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని డాడీ లంబాడి కుటుంబాల చిరకాల సమస్యకు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చొరవతో పరిష్కారం లభించింది. నూతన స్మశాన వాటిక కోసం పోలేపల్లి గ్రామ సర్వే నంబర్ 152లో రెండు ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించి ధ్రువీకరణ పత్రం అందజేయడంతో డాడీ లంబాడి కుటుంబాలు హర్షం వ్యక్తం చేస్తూ మంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపాయి.డాడీ లంబాడి స్మశాన వాటికకు వందేళ్లకు పైగా చరిత్ర ఉందని, మున్నేరు రిటైనింగ్ వాల్, కరకట్ట నిర్మాణాల కారణంగా స్మశాన వాటికలో అధిక భాగం కోల్పోయి పూర్వీకుల సమాధులు కూడా దెబ్బతిన్నాయని వారు తెలిపారు. ఈ సమస్యను కాంగ్రెస్ నాయకుల ద్వారా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దృష్టికి తీసుకెళ్లగా వెంటనే స్పందించి శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు చేపట్టారని పేర్కొన్నారు.గతంలో ఎంపీగా ఉన్న సమయంలో కూడా స్మశాన వాటికకు వెళ్లే రహదారి నిర్మాణానికి ఎంపీ నిధులు మంజూరు చేసిన మంత్రి, ఇప్పుడు స్మశాన వాటిక కోసం ప్రత్యేకంగా రెండు ఎకరాల భూమిని కేటాయించడం తమకు మరువలేని సహాయమని డాడీ లంబాడి కుటుంబాలు పేర్కొన్నాయి. స్థలం కేటాయింపులో సహకరించిన అధికారులకు కూడా వారు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఖమ్మం నగర 32వ డివిజన్ మాజీ కార్పొరేటర్ రుడావత్ రమాదేవి, ఏదులాపురం మున్సిపాలిటీ అధ్యక్షుడు బానోత్ కిషోర్ నాయక్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు కందుకూరి వెంకటరమణ, కోటమర్తి భాస్కర్, సంగని వెంకటేశ్వర్లు, బానోత్ సుమన్, ఏపూరి తరుణ్, డుంగ్రోత్ రాజేష్ కుమార్, ధోణవాన్ శ్రీను, ధోణవాన్ దాసు తదితరులు పాల్గొన్నారు.

إرسال تعليق