ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

ఏదులాపురం మున్సిపాలిటీని రాష్ట్రంలోనే మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతాం



 ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలి – మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి

మొదటి విడతలో రూ.100 కోట్లు, రెండో విడతలో మరో రూ.100 కోట్లతో అభివృద్ధి పనులు

ప్రజాపక్షం/ఖమ్మం రూరల్: రాష్ట్రంలోనే ఏదులాపురం మున్సిపాలిటీని అన్ని రంగాల్లో ఆదర్శంగా నిలిచే మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార & పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. శుక్రవారం హైదరాబాదులోని సచివాలయంలోని తన కార్యాలయంలో ఏదులాపురం మున్సిపల్ కౌన్సిలర్లతో సమావేశమైన ఆయన మున్సిపాలిటీ అభివృద్ధి, ప్రజా సమస్యలు, చేపట్టాల్సిన పనులపై సమగ్రంగా సమీక్షించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజాప్రతినిధులు పనిచేయాలని సూచించారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధినే ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని పనిచేయాలని, రోడ్లు, డ్రైనేజీలు, తాగునీరు, విద్యుత్, ప్రభుత్వ పాఠశాలలు వంటి మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు.ప్రతి కౌన్సిలర్ తన డివిజన్‌లో నిత్యం పర్యటిస్తూ ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని వెంటనే పరిష్కరించే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. స్థానికంగా పరిష్కరించలేని సమస్యలను తన దృష్టికి తీసుకొస్తే ప్రభుత్వం తరఫున తక్షణ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ వారి విశ్వాసాన్ని పొందాలని సూచించారు.ఏదులాపురం మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్న మంత్రి, తొలి విడతలో రూ.100 కోట్లతో రహదారుల అభివృద్ధి పనులు చేపడుతున్నామని, అనంతరం మరో రూ.100 కోట్లతో మిగిలిన మౌలిక వసతుల పనులను పూర్తి చేస్తామని వెల్లడించారు.ప్రజలకు అవసరమైన ప్రాంతాల్లో స్మశాన వాటికల నిర్మాణానికి స్థానిక ప్రజాప్రతినిధులు అనువైన స్థలాలను గుర్తించాలని సూచించారు. స్థలాలు అందుబాటులోకి వచ్చిన వెంటనే అత్యాధునిక వసతులతో స్మశాన వాటికలను నిర్మిస్తామని తెలిపారు. అలాగే అవసరమైన ప్రాంతాల్లో ఆధునిక బస్సు షెల్టర్లను కూడా ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.పాలేరు నియోజకవర్గ వ్యాప్తంగా ప్రభుత్వ భూములపై సమగ్ర సర్వే కొనసాగుతోందని మంత్రి తెలిపారు. సర్వే పూర్తయిన అనంతరం ప్రభుత్వ భూములను గుర్తించి అర్హులైన నిరుపేద కుటుంబాలకు ఇళ్ల స్థలాలను పంపిణీ చేస్తామని స్పష్టం చేశారు.ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు పారదర్శక పాలనకు ప్రజాప్రతినిధులు సహకరించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని ప్రతి పట్టణాన్ని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసి ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చైర్ పర్సన్ పోకబత్తిని అనిత, వైస్ చైర్మన్ తమ్మినేని నవీన్, కౌన్సిలర్లు దండి రంగారావు, మామిండ్ల శ్రీనాథ్ రెడ్డి, దండి శ్రీజ, బానోతు భాస్కర్ ,కడప నవీన్, బానోతు ప్రసాద్, బుర్ర మహేష్, బానోత్ పూల్ చంద్, రవీందర్ , ఊరడి హైమావతి , బానోతు దివ్య, వెంపటి ఉమా, కందుకూరి శేషమ్మ, బోయిన కుమారి, కమిషనర్ ఆళ్ల శ్రీనివాస్ రెడ్డి, ఆర్వో శ్రీధర్ రెడ్డి, ఆర్ ఐ శ్రీనివాస్, వార్డ్ ఆఫీసర్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు. 

إرسال تعليق

Post a Comment (0)

أحدث أقدم