128 క్వింటాళ్లకు పైగా బియ్యం వ్యత్యాసం.. సీతారాంపురం రేషన్ షాపు సీజ్
ప్రజాపక్షం/కారేపల్లి : కారేపల్లి మండలంలోని పలు రేషన్ దుకాణాలను ఖమ్మం రూరల్ సివిల్ సప్లై డిప్యూటీ తహసీల్దార్ విజయబాబు శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా సీతారాంపురం గ్రామంలోని రేషన్ షాపును పరిశీలించగా, నిల్వలు మరియు రికార్డుల పరిశీలనలో 128 క్వింటాళ్లు 37 కిలోల బియ్యం వ్యత్యాసం గుర్తించారు. ఈ అక్రమాలపై రేషన్ డీలర్ ఈసం కృష్ణపై 6-ఏ కేసు నమోదు చేసి, వెంటనే రేషన్ దుకాణాన్ని సీజ్ చేశారు.ప్రజలకు రేషన్ పంపిణీలో ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు, ఆ దుకాణ నిర్వహణ బాధ్యతలను సమీప రేషన్ డీలర్ ఎట్టె నాగేశ్వరరావుకు అదనపు బాధ్యతలుగా అప్పగించినట్లు అధికారులు తెలిపారు.ఈ తనిఖీల్లో సివిల్ సప్లై రెవెన్యూ ఇన్స్పెక్టర్ వీరయ్య పాల్గొన్నారు. అధికారులు రేషన్ డీలర్లు ప్రభుత్వ నిబంధనలను కచ్చితంగా పాటించాలని, అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

إرسال تعليق