ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

పచ్చదనం కోసం యువత శ్రమదానం.. లక్ష్మీ బృందావనం కాలనీలో మొక్కలు నాటిన యువకులు



 ప్రజాపక్షం/ఖమ్మం రూరల్ : నగరాన్ని మరింత హరితవనంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ఎదులాపురం మున్సిపాలిటీలోని బైపాస్ రోడ్డుకు ఆనుకుని ఉన్న లక్ష్మీ బృందావనం కాలనీ (రోడ్డు నెం. 3–4)లో స్థానిక యువకులు స్వచ్ఛందంగా బుధవారం శ్రమదానం నిర్వహించి మొక్కలు నాటారు.కాలనీలో పచ్చదనం పెంపొందించేందుకు చేపట్టిన ఈ కార్యక్రమంలో దండి రంగారావు, బిల్డర్ హరి, సలీం, గడ్డ వీరన్న, గడ్డ కృష్ణ, అక్రమ్, చోటు తదితరులు పాల్గొన్నారు. రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటి, వాటికి రక్షణగా ట్రీ గార్డులను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా మొక్కలను క్రమం తప్పకుండా సంరక్షిస్తూ నీరు పోసే బాధ్యతను కూడా తామే తీసుకుంటామని తెలిపారు.ఈ సందర్భంగా యువకులు మాట్లాడుతూ, "పచ్చదనం పెరిగితేనే ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పడుతుంది. ప్రతి ఒక్కరూ తమ పరిసరాల్లో కనీసం ఒక మొక్కనైనా నాటి దానిని సంరక్షిస్తే నగరం మరింత ఆహ్లాదకరంగా మారుతుంది" అని పేర్కొన్నారు.యువత స్వచ్ఛందంగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని స్థానిక కాలనీవాసులు అభినందిస్తూ, ఇలాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని ప్రాంతాల్లో నిర్వహించాలని ఆకాంక్షించారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post a Comment (0)

కొత్తది పాతది