ప్రజాపక్షం/ఖమ్మం రూరల్: ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో ఆదివారం జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ ఎంపికల పోటీల్లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మల్లెమడుగు విద్యార్థినీలు ప్రతిభ చాటారు.అండర్-12 విభాగం లాంగ్ జంప్‌లో ఎస్.కే. సుహానా, అండర్-14 విభాగం ట్రయాథ్లాన్లో జి. నందిని అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ఈ నెల 12న హైదరాబాద్‌లో జరిగే రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు కె. సాంబమూర్తి, పీఈటీ బియ్యని కృష్ణయ్య తెలిపారు.సుహానా గత ఏడాది అండర్-10 లాంగ్ జంప్‌లో రాష్ట్రస్థాయికి ఎంపిక కాగా, నందిని అండర్-14 రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌కు ఎంపికై తన ప్రతిభను ఇప్పటికే నిరూపించుకుందని వారు పేర్కొన్నారు.రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన సుహానా, నందినిలను ప్రధానోపాధ్యాయులు కె. సాంబమూర్తి, గ్రామ పెద్దలు నూకారపు వెంకటేశ్వరరావు, భోజర్ల సూర్యం, మనోజ్, పాఠశాల పీఈటీతో పాటు ఉపాధ్యాయులు అభినందించారు. భవిష్యత్తులో జాతీయ స్థాయిలోనూ రాణించి పాఠశాలకు, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

إرسال تعليق