ఐదుగురికి మెడిసిన్ సీట్లు.. కళాశాలలో ఆనందోత్సాహాలు
ప్రజాపక్షం/వైరా:నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ప్రకటించిన NEET-2026 ఫలితాల్లో వైరాకు చెందిన న్యూఇరా న్యూ లిటిల్ ఫ్లవర్ కళాశాల విద్యార్థులు విశేష ప్రతిభ కనబర్చారు. కళాశాల నుంచి పరీక్ష రాసిన 20 మంది విద్యార్థుల్లో ఎన్. గోపిక అక్షయ, ఎం. అర్పణ, యు. అక్షరసిరి, వి. యశ్వంత్, ఎన్. ఎంజల్ స్వీటీ మెడిసిన్ సీట్లు సాధించి కళాశాలకు మంచి పేరు తీసుకొచ్చారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో న్యూఇరా విద్యాసంస్థల చైర్మన్ ఐ.వి. రమణారావు, కరస్పాండెంట్ డా. పి. భూమేష్ రావు, డైరెక్టర్ కుర్రా సుమన్ మాట్లాడుతూ, విద్యార్థులను పాఠశాల స్థాయి నుంచే IIT, NEET వంటి జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు ప్రణాళికాబద్ధంగా సిద్ధం చేస్తున్నామని తెలిపారు. అనుభవజ్ఞులైన అధ్యాపక బృందం, నిరంతర పర్యవేక్షణ, ప్రత్యేక శిక్షణ ఫలితంగానే ఈ విజయం సాధ్యమైందని పేర్కొన్నారు.వైరా డివిజన్లో కళాశాల ప్రారంభమైన ఐదేళ్లుగా ప్రతి సంవత్సరం మెడిసిన్ సీట్లు సాధించే విద్యార్థులను అందిస్తున్న ఏకైక కళాశాలగా న్యూఇరా న్యూ లిటిల్ ఫ్లవర్ నిలుస్తోందని వారు గర్వంగా తెలిపారు.కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఎం. భువన ప్రసాద్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొని విజేతలను అభినందించారు.


إرسال تعليق