ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

చిరుతపులి చర్మం, 17 గోర్లతో నలుగురు అరెస్ట్


 ప్రజాపక్షం/ బూర్గంపహాడ్: చిరుతపులి చర్మం, గోర్లను అక్రమంగా విక్రయించేందుకు ప్రయత్నించిన నలుగురిని బూర్గంపహాడ్ పోలీసులు, టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. తాళ్లగొమ్మూరు గ్రామంలోని ఓ ఇంటి వద్ద అనుమానాస్పదంగా ఉన్న నలుగురిని సోమవారం ఉదయం అదుపులోకి తీసుకుని విచారించగా ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం.. నిందితులు గత వేసవిలో చింతూరు మండలం గమ్మలకోట సమీపంలోని అటవీ ప్రాంతంలో గుంతలో చిక్కుకున్న చిరుతపులిని రాళ్లు, కర్రలు, బాణాలతో కొట్టి చంపినట్లు విచారణలో వెల్లడించారు. అనంతరం చిరుత చర్మాన్ని తొలగించి ఎండబెట్టడంతో పాటు 17 గోర్లను భద్రపరిచినట్లు పోలీసులు తెలిపారు. చిరుత చర్మం, గోర్లను విక్రయించి డబ్బు సంపాదించేందుకు ప్రయత్నించిన నిందితులు.. కొనుగోలుదారులను సంప్రదించేందుకు సారపాకకు చెందిన చల్లా అనిల్ కుమార్‌ను కలిసినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ క్రమంలో చర్మం, గోర్లను చిన్న బ్యాగ్‌లో పెట్టుకుని తాళ్లగొమ్మూరులోని అనిల్ కుమార్ ఇంటికి తీసుకురాగా, విక్రయానికి ప్రయత్నిస్తున్న సమయంలో పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుంచి ఒక చిరుతపులి చర్మం, 17 గోర్లు, ఒక చిన్న బ్యాగ్ స్వాధీనం చేసుకున్నారు. ఈ వివరాలను జిల్లా ఎస్పీ రోహిత్ రాజు, ఐపీఎస్ వెల్లడించారు.

అరెస్టైన వారు: 1. చల్లా అనిల్ కుమార్ – తాళ్లగొమ్మూరు, సారపాక ,2. కుంజ భద్రయ్య – గమ్మలకోట, చింతూరు మండలం ,3. కుంజా గంగరాజు – గమ్మలకోట, చింతూరు మండలం ,4. మడవి కన్నయ్య – గమ్మలకోట, చింతూరు మండలం

ఈ ఆపరేషన్‌లో పాల్వంచ డీఎస్పీ ఆర్. సతీష్ కుమార్, ఎస్బీ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్, పాల్వంచ సీఐ సతీష్, టాస్క్‌ఫోర్స్ సీఐ రమాకాంత్, ఎస్సైలు నాగ బిక్షం, ప్రవీణ్, సుమన్ తదితర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

إرسال تعليق

Post a Comment (0)

أحدث أقدم