ప్రజాపక్షం/చర్ల: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టుకు వరద ఉధృతి పెరుగుతోంది. ఎగువ ప్రాంతమైన ఛత్తీస్గఢ్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. వరద ప్రవాహం పెరగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రాజెక్టుకు చెందిన 8 గేట్లను పూర్తిగా, మరో 9 గేట్లను రెండు అడుగుల మేర ఎత్తి, మొత్తం 73,988 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉండటంతో ప్రాజెక్టు దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

إرسال تعليق