ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

28వ వార్డు అభివృద్ధికి మరో అడుగు..!


 సిపిఐ కౌన్సిలర్ దండి రంగారావు చొరవతో సైడ్ కాలువ పనులకు శ్రీకారం

ప్రజాపక్షం/ఖమ్మం రూరల్: ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న 28వ వార్డు సిపిఐ కౌన్సిలర్ దండి రంగారావు మరో కీలక అభివృద్ధి పనికి సోమవారం శ్రీకారం చుట్టారు. ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని శ్రీరామనగర్ మెయిన్ రోడ్డు నుంచి నంబూరి రామారావు ఇంటి వరకు నిర్మించనున్న సైడ్ కాలువ పనులకు సోమవారం శంకుస్థాపన చేశారు.ఎన్నో రోజులుగా స్థానికులను వేధిస్తున్న మురుగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలనే లక్ష్యంతో ఈ పనులు ప్రారంభిస్తున్నట్లు దండి రంగారావు తెలిపారు. ప్రజల సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కార చర్యలు చేపట్టడంలో తాను ఎప్పుడూ ముందుంటానని, అభివృద్ధి విషయంలో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు.కాలువ నిర్మాణం పూర్తయితే వర్షాకాలంలో నీరు నిల్వ ఉండకుండా పారడంతో పాటు రాకపోకలకు ఇబ్బందులు తొలగి పరిసరాలు పరిశుభ్రంగా మారనున్నాయి. ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ 28వ వార్డును అభివృద్ధి పథంలో నడిపిస్తున్న కౌన్సిలర్ దండి రంగారావు సేవలను స్థానికులు అభినందించారు.

إرسال تعليق

Post a Comment (0)

أحدث أقدم