ఖమ్మం రూరల్ మండల ఉప సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా పెద్దపుంగు నరేష్
ప్రజాపక్షం/ఖమ్మం రూరల్: ఖమ్మం రూరల్ మండల ఉప సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా పొన్నెకల్లు గ్రామ ఉప సర్పంచ్ పెద్దపుంగు నరేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అరెంపుల గ్రామంలో ఆదివారం నిర్వహించిన మండల ఉప సర్పంచుల సమావేశంలో జిల్లా ఉప సర్పంచుల ఫోరం అధ్యక్షుడు శెట్టి శ్రీనివాస్ సమక్షంలో మండల కమిటీని ఎన్నుకున్నారు. మండల అధ్యక్షుడిగా ఎన్నికైన అనంతరం పెద్దపుంగు నరేష్ మాట్లాడుతూ, తనపై విశ్వాసం ఉంచి బాధ్యతలు అప్పగించిన ప్రతి ఉప సర్పంచ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. మండలంలోని ఉప సర్పంచుల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తానని, వారి హక్కుల పరిరక్షణ కోసం ఐక్యంగా పోరాటం సాగిస్తానని పేర్కొన్నారు. ఉప సర్పంచుల మధ్య సమన్వయం పెంపొందించి ఫోరంను బలోపేతం చేయడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటానన్నారు.ఈ సందర్భంగా మండల కమిటీని కూడా ఎన్నుకున్నారు. ప్రధాన కార్యదర్శిగా బానోత్ శ్రీను, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా సుదగాని విజయలక్ష్మి, ఉపాధ్యక్షులుగా షేక్ దావూద్, బానోత్ పోలీ, సహాయ కార్యదర్శులుగా కొట్టే వెంకటేశ్వర్లు, చల్లా లక్ష్మణ్ ఎన్నికయ్యారు. నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన పెద్దపుంగు నరేష్ తో సహా నూతన కమిటీకి సమావేశంలో పాల్గొన్న ఉప సర్పంచులు, నాయకులు అభినందనలు తెలియజేసి శుభాకాంక్షలు తెలిపారు.


إرسال تعليق