ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

శ్రీనన్న ఆత్మీయ భరోసా.. 44నిరుపేద కుటుంబాలకు రూ.4 లక్షల 40వేల ఆర్థిక సాయం


 శ్రీనన్న ఆత్మీయ భరోసా.. 44నిరుపేద కుటుంబాలకు రూ.4 లక్షల 40వేల నా ఆర్థిక సాయం

 పీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఒక్కో కుటుంబానికి రూ.10 వేల చొప్పున అందజేత

ప్రజాపక్షం/ఖమ్మం రూరల్: ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని వివిధ వార్డుల్లో ఇటీవల కుటుంబ పెద్దలను కోల్పోయి విషాదంలో ఉన్న 44 నిరుపేద కుటుంబాలకు పీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఒక్కో కుటుంబానికి రూ.10 వేల చొప్పున మొత్తం రూ.4 లక్షల 40 వేల ఆర్థిక సహాయాన్ని మంగళవారం మున్సిపల్ కాంగ్రెస్ నాయకులు అందజేశారు. అనంతరం మృతుల చిత్రపటాలకు పూలమాలలు వేసి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తరఫున ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారుల కుటుంబ సభ్యులు మాట్లాడుతూ..కుటుంబంలో వ్యక్తిని కోల్పోయి తీవ్ర మనోవేదనలో ఉన్న సమయంలో రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ మరియు సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ప్రారంభించిన "శ్రీనన్న ఆత్మీయ భరోసా" పథకం తమకు ఎంతో అండగా నిలిచిందని పేర్కొన్నారు. ప్రతి పేద కుటుంబానికి అండగా నిలుస్తూ అందిస్తున్న ఈ ఆర్థిక భరోసాపై మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డికి వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు

1 تعليقات

إرسال تعليق

Post a Comment

أحدث أقدم