ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

స్నేహితుల ఔదార్యం...


 మిత్రుడి కంటి చూపు ఆపరేషన్‌కు రూ.15 వేల ఆర్థిక సాయం

ప్రజాపక్షం/ఖమ్మం రూరల్: ఆపదలో ఉన్న స్నేహితుడికి అండగా నిలవడమే నిజమైన స్నేహమని  నిరూపించి,  మిత్రబృందం తమ ఔదార్యాన్ని చాటుకుంది. కంటి చూపు కోల్పోయి ఆర్థిక ఇబ్బందులతో చికిత్స చేయించుకోలేని కెప్టెన్ బంజర కు చెందిన నిరుపేద లంజపల్లి రమేష్‌కు కంటి ఆపరేషన్ నిర్వహించేందుకు ప్రాణ స్నేహితుల ఆధ్వర్యంలో రూ.15,000 నగదు ఆర్థిక సహాయాన్ని మంగళవారం అందజేశారు.రమేష్ త్వరగా కోలుకుని సాధారణ జీవితంలోకి తిరిగి రావాలని ఆకాంక్షిస్తూ మిత్రులు ఈ సహాయాన్ని అందించారు. అవసర సమయంలో స్నేహితుడికి అండగా నిలిచిన వారి సేవాభావాన్ని స్థానికులు అభినందించారు.ఈ కార్యక్రమంలో వేగినాటి నరేష్, ఏపూరి రామారావు, ఏపూరి రాధాకృష్ణ, ఏపూరి నవీన్‌తో పాటు పలువురు మిత్రులు పాల్గొన్నారు.

إرسال تعليق

Post a Comment (0)

أحدث أقدم