ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

5వ వార్డులో సమస్యలపై క్షేత్రస్థాయి పరిశీలన



 5వ వార్డులో సమస్యలపై క్షేత్రస్థాయి పరిశీలన

మున్సిపల్ కమిషనర్‌ ఆళ్ల శ్రీనివాస్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లిన కౌన్సిలర్ నాగేంద్ర ప్రసాద్

ప్రజాపక్షం/ఖమ్మం రూరల్: ఏదులాపురం మున్సిపాలిటీ 5వ వార్డులో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరుతూ మంగళవారం వార్డు కౌన్సిలర్ నాగేంద్ర ప్రసాద్, మున్సిపల్ కమిషనర్ శ్రీ ఆళ్ల శ్రీనివాస్ రెడ్డితో కలిసి వార్డులో విస్తృతంగా క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఈ సందర్భంగా ద్విచక్ర వాహనాలపై పలు ప్రాంతాలను పరిశీలించి, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. పెద్దతండ కాలనీలోని ఖాళీ స్థలంలో పెరిగిన పెద్ద చెట్లు, పొదల కారణంగా విషపూరిత పాములు సంచరించే అవకాశం ఉందని, వాటిని వెంటనే తొలగించాలని కోరారు. అలాగే YM Press, YC Pressలకు చెందిన ఖాళీ స్థలాల్లో పెరిగిన చెట్లు, పొదలను తొలగించి ప్రజలకు ఎలాంటి ప్రమాదం కలగకుండా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. గ్రీన్ కాకతీయ నగర్‌లో సీసీ రోడ్డు నిర్మాణం అత్యవసరంగా చేపట్టాలని, ఆర్టీసీ కాలనీలో ప్రజలకు ఇబ్బందికరంగా ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌ను సురక్షిత ప్రాంతానికి తరలించాలని కమిషనర్‌కు వివరించారు. కొత్తగా నిర్మించిన డ్రైనేజీకి కల్వర్టు నిర్మించకుండా వదిలివేయడంతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను కూడా ఆయన దృష్టికి తీసుకెళ్లారు. అదేవిధంగా ఓ ఇంటి ముందు కాలువలో పేరుకుపోయిన చెత్తను తొలగించి పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని కోరారు. ఆర్టీసీ కాలనీలో డ్రైనేజీ నీరు నేరుగా ఓ ఇంట్లోకి చేరడంతో ఆ కుటుంబం ఇల్లు ఖాళీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడిన విషయాన్ని కమిషనర్‌కు ప్రత్యక్షంగా చూపించి, సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వార్డులో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా కమిషనర్ ఆళ్ల శ్రీనివాస్ రెడ్డి హామీ ఇచ్చారు. 5వ వార్డులో ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, వెంటనే స్పందించిన మున్సిపల్ కమిషనర్‌కు 5వ వార్డు ప్రజల తరఫున కౌన్సిలర్ నాగేంద్ర ప్రసాద్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రెవిన్యూ ఆర్ ఐ రఘు పాల్గొన్నారు.

إرسال تعليق

Post a Comment (0)

أحدث أقدم