ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

ఖమ్మంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు



 జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

మహనీయుల ఆశయాలతో 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యం

ప్రజాపక్షం/ఖమ్మం: 80వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఖమ్మం పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. పరేడ్‌ గ్రౌండ్స్‌కు చేరుకున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు జిల్లా కలెక్టర్‌ దివాకర్‌ టీఎస్‌, పోలీస్‌ కమిషనర్‌ సునీల్‌ దత్‌ ఘన స్వాగతం పలికారు. అనంతరం సాయుధ పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. మహాత్మాగాంధీ సారథ్యంలో సాగిన భారత స్వాతంత్ర్య పోరాటం ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. ఎందరో మహనీయుల త్యాగాల ఫలితంగా లభించిన స్వాతంత్ర్యానికి అర్థం, పరమార్థం చేకూర్చేలా ప్రజాస్వామ్య పాలనకు బలమైన పునాదులు వేసుకున్నామని తెలిపారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ స్వతంత్ర భారతదేశానికి రాజ్యాంగాన్ని రచించి ప్రతి పౌరుడికి సమాన హక్కులు, స్వేచ్ఛ, న్యాయం అందేలా ప్రజాస్వామ్య వ్యవస్థకు పటిష్టమైన పునాదులు వేశారని పేర్కొన్నారు. మహనీయుల ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం అన్ని రంగాల్లో వేగంగా ముందుకు సాగుతోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో ఖమ్మం జిల్లా సాధిస్తున్న పురోగతిని ఈ సందర్భంగా వివరించారు. అనంతరం విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వివిధ శాఖల ఉద్యోగులకు డిప్యూటీ సీఎం ప్రశంసా పత్రాలను అందజేసి అభినందించారు. దేశభక్తి, జాతీయ స్ఫూర్తితో నిర్వహించిన స్వాతంత్ర్య వేడుకలు పరేడ్‌ గ్రౌండ్స్‌లో ఆకట్టుకున్నాయి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post a Comment (0)

కొత్తది పాతది