ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి...



 వ్యక్తిగత వివరాలు పంచుకోవద్దు

ముసలిమడుగు ట్రైబల్ వెల్ఫేర్ జూనియర్ కళాశాలలో సైబర్ జాగృతా దివాస్ నిర్వహణ

వైరా ఏసీపీ సారంగపాణి

ప్రజాపక్షం /వైరా: సాంకేతిక పరిజ్ఞానం విస్తరిస్తున్న కొద్దీ సైబర్ నేరాల సంఖ్య కూడా రోజురోజుకూ పెరుగుతోందని, ప్రజలు అప్రమత్తంగా లేకపోతే క్షణాల్లోనే తమ కష్టార్జితాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని వైరా ఏసీపీ సారంగపాణి హెచ్చరించారు. పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆదేశాల మేరకు బుధవారం వైరా పోలీస్ స్టేషన్ పరిధిలోని ముసలిమడుగు ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో నిర్వహించిన సైబర్ జాగృతా దివాస్ కార్యక్రమంలో పాల్గొన్న ఏసిపి సారంగపాణి విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఏసీపీ సారంగపాణి మాట్లాడుతూ, బ్యాంకు ఖాతా వివరాలు, ఏటీఎం పిన్, ఓటీపీ, పాస్‌వర్డులు వంటి గోప్య సమాచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అపరిచితులతో పంచుకోవద్దన్నారు. కేవైసీ అప్‌డేట్, బహుమతులు, లాటరీలు, ఉద్యోగాలు, రుణాలు లేదా డిజిటల్ చెల్లింపుల పేరుతో వచ్చే కాల్స్, మెసేజ్‌లు, లింక్‌లను నమ్మి స్పందించరాదని సూచించారు. ఇటీవల డిజిటల్ అరెస్ట్, ఫేక్ ఇన్వెస్ట్‌మెంట్, ఆన్‌లైన్ షాపింగ్, సోషల్ మీడియా హ్యాకింగ్ వంటి మోసాలు అధికమవుతున్నాయని తెలిపారు. ప్రభుత్వ అధికారులు లేదా పోలీసులమని చెప్పి ఫోన్ చేసే వ్యక్తులను నమ్మవద్దని, ఎలాంటి బెదిరింపులకు గురైనా వెంటనే స్థానిక పోలీసులను సంప్రదించాలని సూచించారు. సైబర్ మోసానికి గురైన వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేయడం లేదా సమీప పోలీస్ స్టేషన్‌లో సమాచారం ఇవ్వడం ద్వారా డబ్బులు తిరిగి పొందే అవకాశాలు పెరుగుతాయని ఏసీపీ వివరించారు. సైబర్ నేరాలను అరికట్టడంలో ప్రజల అప్రమత్తతే ప్రధాన ఆయుధమని, ప్రతి ఒక్కరూ డిజిటల్ లావాదేవీల్లో జాగ్రత్తగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైరా సీఐ వెంకటప్రసాద్, ఎస్సై రామారావు తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post a Comment (0)

కొత్తది పాతది