చిరుజల్లులతో మొదలై జోరు వానలోనూ ఆగని మంత్రి పొంగులేటి మార్నింగ్ వాక్
22, 23 వార్డుల్లో అభివృద్ధి పనులపై క్షేత్రస్థాయిలో పరిశీలన
ప్రజాపక్షం/ఖమ్మం రూరల్: రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార & పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శుక్రవారం ఉదయం 6 గంటలకే ఏదులాపురం మున్సిపాలిటీలోని 22, 23 వార్డుల్లో మార్నింగ్ వాక్ నిర్వహించారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకోవడంతో పాటు అభివృద్ధి పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించడమే లక్ష్యంగా చేపట్టిన ఈ పర్యటనలో వర్షంలో తడుస్తూ నడుస్తూ ముందుకు సాగారు.ఈ సందర్భంగా 22వ వార్డులో నిర్మాణంలో ఉన్న పార్కును సందర్శించిన మంత్రి, పనుల నాణ్యతను పరిశీలించి ప్రజలకు మరింత ఉపయోగకరంగా ఉండేలా అభివృద్ధి చేయాలని అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం కాలినడకన వార్డులో పర్యటిస్తూ స్థానికులను ఆప్యాయంగా పలకరించి వారి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ప్రజలు వినిపించిన సమస్యలను ప్రాధాన్యతతో పరిష్కరించాలని సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేశారు.ఇదే సమయంలో చిరుజల్లులు ప్రారంభమైనప్పటికీ వాటిని ఏమాత్రం లెక్కచేయకుండా తడుస్తూనే కాలినడకన ముందుకు సాగారు. అనంతరం 23వ వార్డులోకి చేరుకునే సమయానికి వర్షం ఒక్కసారిగా జోరందుకున్నా మంత్రి తన పర్యటనను నిలిపివేయలేదు. స్వయంగా గొడుగు పట్టుకుని 23వ వార్డులో కొనసాగుతున్న అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పనులు నాణ్యతతో, వేగంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.జోరు వానలోనూ ప్రజల మధ్యే ఉంటూ అభివృద్ధి పనులను పరిశీలించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీరు స్థానికులను ఆకట్టుకుంది. వర్షం కురుస్తున్నా పర్యటనను నిలిపివేయకుండా ప్రజల సమస్యలను తెలుసుకుంటూ అభివృద్ధి పనులను సమీక్షించడం ప్రజల పట్ల ఆయనకున్న నిబద్ధతకు నిదర్శనమని పలువురు స్థానికులు అభిప్రాయపడ్డారు.
మంత్రి వెంట క్షేత్రస్థాయిలో అడుగడుగునా అధికార యంత్రాంగం
మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మార్నింగ్ వాక్ సందర్భంగా జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ తో కలిసి సంబంధిత జిల్లాస్థాయి శాఖల అధికారులు, మున్సిపాలిటీ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, చైర్ పర్సన్ పోకబత్తిని అనిత , అడుగడుగునా వెంట ఉండి వార్డుల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. ప్రజలు ప్రస్తావించిన సమస్యలను మంత్రి నేరుగా అధికారుల దృష్టికి తీసుకెళ్లగా, వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. చిరుజల్లులతో ప్రారంభమైన పర్యటన జోరు వర్షంలోనూ కొనసాగినా అధికారులు సైతం మంత్రి వెంటనే ఉండి క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించడం విశేషంగా నిలిచింది. అభివృద్ధి పనుల నాణ్యత, పురోగతి, ప్రజలకు అవసరమైన మౌలిక వసతులపై మంత్రి ఎప్పటికప్పుడు అధికారులకు సూచనలు చేస్తూ ముందుకు సాగారు.


إرسال تعليق