11 ఏళ్ల బాలికతో అనుచిత ప్రవర్తన
గౌరవరపు డేవిడ్ పై పోక్సో కేసు
గతంలో డేవిడ్ రాజు పై రౌడీషీట్
రిమాండ్ కు పంపిన పోలీసులు
ప్రజాపక్షం/ వైరా: ఇంట్లో ఒంటరిగా ఉన్న 11 ఏళ్ల బాలిక పట్ల అనుచితంగా ప్రవర్తించాడనే ఆరోపణలు వైరాలో కలకలం రేపాయి. టీఆర్ఎస్ వైరా నియోజకవర్గ ఇన్‌చార్జ్ గౌరవరపు డేవిడ్ అలియాస్ జగదీశ్‌పై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. బాలిక వద్దకు వెళ్లిన డేవిడ్, గణితం చెబుతానని చెప్పి ఆమె పట్ల అనుచితంగా ప్రవర్తించినట్లు బాలిక కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. తల్లి ఇంటికి వచ్చిన తర్వాత బాలిక కన్నీరుమున్నీరవుతూ జరిగిన విషయాన్ని చెప్పడంతో కుటుంబ సభ్యులు వెంటనే 112కు సమాచారం అందించారు. వైరా ఎస్‌ఐ పుష్పాల రామారావు సిబ్బందితో అక్కడికి చేరుకుని డేవిడ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఫిర్యాదు మేరకు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్ కు పంపారు.
గతంలో డేవిడ్ రాజు పై రౌడీ షీట్
డేవిడ్ రాజు పై గతంలో పలు కేసుల నేపథ్యంలో రౌడీషీట్ ఓపెన్ చేశారు కొన్ని సంవత్సరాల తర్వాత ఆ రౌడీషీట్ను తొలగించారు అయినా కూడా ప్రవర్తనలో మార్పు రాలేదని ప్రజలు తెలుపుతున్నారు.
కవిత ముఖ్యమంత్రి ...నేను ఉప ముఖ్యమంత్రి
తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ముఖ్యమంత్రి అవుతున్నారు నేను వైరాలో గెలిచి ఉపముఖ్యమంత్రి అవుతాం అంటూ బెదిరించిన సందర్భాలు కూడా ఉన్నాయని పలువురు చెబుతున్నారు కవిత పార్టీ ఆవిర్భావ సమయంలో సందడి ఇవ్వకపోతే మీ సంగతి చూస్తానని అన్నట్లు ఆరోపణ సైతం ఉన్నాయి.ఓ చిన్నారి భద్రతకు భరోసా ఇవ్వాల్సిన వ్యక్తే.. ఆమెకు భయాన్ని మిగిల్చాడనే ఆరోపణలు రావడం స్థానికంగా తీవ్ర చర్చకు దారితీసింది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి