ప్రజాపక్షం/వైరా: శ్రీ వాసవి ఆర్యవైశ్య కళ్యాణ మండపం ఆవరణలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి మందిరం వద్ద శ్రావణమాస శుక్రవారం సందర్భంగా ఆర్యవైశ్య మహిళలకు సామూహిక కుంకుమ పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ఆర్యవైశ్య మహిళలు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి భక్తిశ్రద్ధలతో పూజలు చేసి, సామూహికంగా కుంకుమ పూజ నిర్వహించారు. శ్రావణమాసంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ మహిళా విభాగం అధ్యక్షురాలు రాయపూడి భవాని, రాష్ట్ర మహాసభ ఉపాధ్యక్షులు వనమా విశ్వేశ్వరరావు, కళ్యాణ మండపం అధ్యక్షులు డాక్టర్ పెరుమాళ్ల కృష్ణమూర్తి, ప్రధాన కార్యదర్శి నూకల శ్రీనివాసరావు (వాసు), కోశాధికారి మిట్టపల్లి వెంకటరమణ, రాష్ట్ర మహిళా విభాగం నాయకురాలు వనమా మణికుమారి, రాష్ట్ర మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు కొదుమూరి భాగ్యలక్ష్మి, కార్యదర్శి నూకల అన్నపూర్ణ, రాయల విజయలక్ష్మి, గజ్జల మాణిక్యమ్మ తదితరులు పాల్గొన్నారు.అలాగే కార్యవర్గ సభ్యులు రంగా వాసవి, నాళ్ల నాగమల్లేశ్వరి, వాసవి వనిత క్లబ్ అధ్యక్షురాలు మిట్టపల్లి మహాలక్ష్మి, కోశాధికారి మిట్టపల్లి సుధారాణి, సుగ్గల మాధవి, కొల్లా నాగమణి, మిట్టపల్లి రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి